• తాజా వార్తలు

గూగుల్ జీబోర్డ్ ఉప‌యోగించి యానిమేటెడ్ జీఐఎఫ్‌లు త‌యారు చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

జీఐఎఫ్‌... ఇదో విప్ల‌వం. ఎందుకంటే అటు ఇమేజ్ కాకుండా ఇటు వీడియో కాకుండా మ‌ధ్య‌లో ఉండే యానిమేటెడ్ ఇమేజ్ లాంటిది ఇది. ఇప్పుడు ఇదే ట్రెండ్‌. ముఖ్యంగా ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల‌లో జీఐఎఫ్ల‌ను బాగా ఉప యోగిస్తున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేకం జీఐఎఫ్ క్రియేట‌ర్‌ల‌ను వాడుతున్నారు. ఐవోఎస్‌లో జీబోర్డ్ ఇందుకోసం ఉప‌యోగ‌ప‌డుతుంది.  అయితే ఆండ్రాయిడ్‌లో మాత్రం బేటా వెర్ష‌న్ ద్వారా ఇది అందుబాటులో ఉంది.  అయితే జీబోర్డ్‌ను ఉప‌యోగించి యానిమేటెడ్ జీఐఎఫ్లు త‌యారు చేయ‌డానికి ఒక ప్రాసెస్ ఉంది. అదెంటో చూద్దాం...

జీబోర్డును ఉప‌యోగించి..
మీ డివైజ్‌లో జీబోర్డు ఉంటే చాలు జీఐఎఫ్ లు తయారు చేయ‌డం సుల‌భమే. అది ఐవోఎస్ అయినా లేదా ఆండ్రాయిడ్ అయినా కూడా జీఐఎఫ్‌లు త‌యారు చేసుకోవ‌చ్చు. ముందుగా ఒక టెక్ట్ బాక్స్ ఓపెన్ చేసుకుని.. ఎమోజీ బ‌ట‌న్ మీద ట్యాప్ చేయాలి. ఇది జీఐఎఫ్‌ల కోస‌మే నిర్దేశించిన బ‌ట‌న్‌. దీనిపై లాంగ్ ప్రెస్ చేస్తే.. మీరు ఏం కీబోర్డు ఎంచుకోవాలో ఆప్ష‌న్లు వ‌స్తాయి. ఎమోజీ బోర్డ్ అడుగుభాగంలో జీఐఎఫ్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది దానిపై ట్యాప్ చేయాలి. ఆ జీఐఎఫ్ మెనూ ఓపెన్ చేస్తే మై జీఐఎఫ్ అనే బ‌ట‌న్ క‌నిపిస్తుంది.

మేక్ ఏ జీఐఎఫ్
ఈ మెనూలోనే మేక్ ఏ జీఐఎఫ్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దీనిలో మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. ఇందుకు మీరు రేర్ లేదా ఫ్రంట్ కెమెరా ఉప‌యోగించొచ్చు. కెమెరా బ‌ట‌న్ ద్వారా దీన్ని మార్చుకోవ‌చ్చు. మీ జీఐఎఫ్ ను షూట్ చేయ‌డానికి షూట‌ర్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. అలా హోల్డ్ చేసి ప‌ట్టుకుంటే చాలు మీకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగా మీకో జీఐఎఫ్ క్రియేట్ అవుతుంది. రికార్డింగ్ ఫినిష్ కాగానే దాన్ని క్లిప్‌బోర్డ్‌కు కాపీ చేసి దాన్ని మాన్యువ‌ల్‌గా పేస్ట్ చేయాలి.  ఆండ్రాయిడ్‌లో అయితే ఇది ఆటోమెటిక్‌గా ఫినిష్ అవుతుంది. 

జన రంజకమైన వార్తలు