• తాజా వార్తలు

4 కే టీవీతో మీ హోమ్ ధియేట‌ర్‌ను త‌యారు చేసుకోవ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 7 సంవత్సరాల క్రితం /

హోమ్ ధియేట‌ర్.. సినిమా ప్రియుల‌కు ఇదో క‌ల‌.  ఇంట్లోనే కూర్చుని ఎప్పుడంటే అప్పుడు.. ఆత్మీయుల‌తో క‌లిసి మ‌న‌కు ఇష్ట‌మైన క్లాసిక్ మూవీల‌ను చూడ‌డంలో ఉండే మజానే వేరు. అయితే ఇది బాగా డ‌బ్బున్న వాళ్ల ఇంట్లోనే సాధ్యం.! ఇది ఒక‌ప్ప‌టి మాట‌... ఇప్పుడు కాస్త శ్ర‌ద్ధ పెడితే మ‌నం కూడా హోమ్ ధియేట‌ర్‌ను సృష్టించుకోవ‌చ్చు. అది 4కే టీవీతో సాధ్యం.  హోమ్ ధియేట‌ర్ ఏర్పాటు చేసుకోవ‌డం పెద్ద త‌ల‌నొప్పి అనే అభిప్రాయం కూడా త‌ప్పే.  మీకు ఒక 4కే టెలివిజ‌న్ ఉంటే చాలు. మీ సొంతంగా ఒక హోమ్ ధియేట‌ర్ త‌యారు చేసుకోవ‌చ్చు.

అనుకూల‌మైన రూమ్ 
హోమ్ ధియేట‌ర్‌ను ఇంట్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెడితే దాని లుక్ ఉండ‌దు. మ‌న‌కు సౌక‌ర్యం కూడా కాదు.  దీని కోసం మ‌రీ పెద్ద రూమ్ కూడా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఉండాల్సింద‌ల్లా అంద‌రూ కూర్చోగ‌లిగి, మంచి వ్యూ  ఉండే రూమ్ మాత్ర‌మే. అంతేకాదు అన్నిటికంటే మరో ముఖ్య విష‌యం ఈ రూమ్‌లో ఉండే కిటికీల సంఖ్య‌. అంటే ఎక్కువ కిటికీలు ఉంటే అంత‌గా టీవీ స్క్రీన్ మీద లైట్ ప‌డే అవ‌కాశం ఉంటుంది. అయితే మీ బేస్‌మెంట్‌నే హోమ్ ధియేట‌ర్‌గా మార్చాల‌నుకుంటే ముందుగా వాట‌ర్ లైన్లు, ఎల‌క్ట్రిక‌ల్ వైర్ల‌ను స‌ర్దుబాటు చేసుకోవాలి. వాటి వ‌ల్ల ఎలాంటి అగ్నిప్ర‌మాదాలు సంభ‌వించ‌కూడా చూసుకోవాలి. 

ఫ్లోర్‌కు కార్పెట్ ప‌ర‌చండి
మీరు హోమ్ ధియేట‌ర్‌గా మార్చాల‌నుకుంటున్న రూమ్ వినైన్‌, లేదా వుడ్ ఫ్లోరింగ్ ఉంటే వెంట‌నే దాన్ని కార్పెట్‌తో కప్పేయండి. దీని వ‌ల్ల ఫ్లోర్‌, టీవీ స్పీక‌ర్ మ‌ధ్య సౌండ్ క‌లిసిపోయే అవ‌కాశం లేదు. అంతేకాదు టీవీ సౌండ్ మ‌రింత స్ప‌ష్టంగా ఆహ్లాదంగా ఉంటుంది.  దీని వ‌ల్ల మీకు మంచి మూవీ ఎక్స్‌పీరియ‌న్స్ వ‌స్తుంది. డార్క్ క‌ల‌ర్ కార్పెట్ వ‌ల్ల రూమ్ డిమ్ అయి మీకు స్క్రీన్ మరింత స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

రూమ్‌కు పెయింట్ వేయండి
మీరు హోమ్ ధియేట‌ర్ కోసం ఎంపిక చేసుకున్న రూమ్ గోడ‌లు క‌ల‌ర్స్‌తో త‌ళ‌త‌ళ‌లాడుతుంటే వాటిని మార్చాలి. డార్క్ షేడ్ ఉన్న పెయింట్ వేయాలి. అయితే మ‌రీ డార్క్ క‌ల‌ర్స్ ఎంపిక చేసుకోక‌పోవ‌డం ఉత్త‌మం. ఈ క‌ల‌ర్స్ వ‌ల్ల రూమ్ వాతావ‌ర‌ణ‌మే మారిపోతుంది. మీకు కాన్‌స‌న్‌ట్రేష‌న్ మొత్తం టీవీ స్క్రీన్ మీదే ఉంటుంది. ప‌ర్పుల్‌, రెడ్‌, మారూన్‌ల‌తో డార్క్ షేడ్స్ ఉన్న క‌ల‌ర్స్ అయితే బెట‌ర్‌. 

ఎల్ఈడీ లైట్లు
మీ రూమ్‌కు హోమ్ ధియేట‌ర్ క‌ళ రావాలంటే లైట్ల‌ది కీల‌క‌పాత్ర‌. అందుకే ఎల్ఈడీ డైన్‌లైట్ల‌ను అమ‌ర్చుకోవాలి. దీని వ‌ల్ల మీరు ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా రూమ్ లైటింగ్‌లో మార్పు చేర్పులు చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు మీ 4కే టీవీని ఎక్క‌డ ఏ స్థానంలో ఉంచాలో నిర్ణ‌యించుకోవాలి. అంటే రూమ్‌లో వ్యూ ఎక్క‌డ ఉంటే అక్కడే దాన్ని అమ‌ర్చాలి.  మీ టీవీ సైజును బ‌ట్టి దాన్ని ఎక్క‌డ ఫిట్ చేసుకోవాలో చూడాలి. వాల్ మీద అటు ఇటు ఏమీ లేకుండా చూసుకోవాలి. లేక‌పోతే మీకు మూవీ ఎక్స‌పీరియ‌న్స్ మిస్ అవుతుంది.

జన రంజకమైన వార్తలు