• తాజా వార్తలు

ఎంఐయూఐ 11లో వీడియో వాల్ పేప‌ర్ సెట్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

ఎంఐయూఐ ఇటీవ‌లే భార‌త్‌లో రెడ్ మి నోట్ 8, రెడ్ మి నోట్ 8 ప్రొ విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఫోన్ల‌లో హైలెట్ ఫీచ‌ర్ ఒక టి ఉంది అదే వీడియో వాల్ పేప‌ర్‌. చాలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ వాల్‌పేప‌ర్‌గా ఇమేజ్ పెట్టుకునేలా ఆఫ‌ర్ చేస్తున్నాయి కానీ ఏ స్మార్ట్‌ఫోన్ కూడా వీడియో వాల్ పేప‌ర్‌ను సెట్ చేసుకునే ఆప్ష‌న్ ఇవ్వ‌ట్లేదు. కానీ ఎంఐయూఐ 11 ఫోన్ల‌లో ఈ ఆప్ష‌న్ ఉంది. మ‌రి 
ఈ వీడియో వాల్ పేప‌ర్‌ను ఎలా సెట్ చేసుకోవాలో తెలుసా?

ఎలా సెట్ చేయాలి?
1. మీ స్మార్ట్‌ఫోన్ ఎంఐయూఐ 11 మీ ఫోన్లో అప్‌డేటెడ్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక‌సారి ఇది అప్‌డేట్ అయిన త‌ర్వాత ఒక వీడియో తీసుకోవాలి. లేదా గ్యాల‌రీ నుంచి ఒక వీడియో డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

2. ఆ త‌ర్వాత గ్యాల‌రీ యాప్ ఓపెన్ చేసి ఒక వీడియో సెల‌క్ట్ చేసుకోవాలి. చివ‌ర్లో ఉన్న మూడు డాట్స్ మీద క్లిక్ చేయాలి. 

3.  ఈ ఆప్ష‌న్ సెల‌క్ట్ చేయ‌గానే ఒక పాప‌ప్ మెనూ వ‌స్తుంది.  దీనిలో సెట్ వీడియో వాల్‌పేప‌ర్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి

4. చివ‌రిగా మీ వీడియో బ్యాక్ గ్రౌండ్ సౌండ్ కావాలంటే సెట్ చేసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత అప్లై మీద క్లిక్ చేయాలి. అంతే మీ స్మార్ట్‌ఫోన్లో మీరు కోరుకున్ వీడియో వాల్‌పేప‌ర్‌గా సెట్ అయిపోతుంది.

జన రంజకమైన వార్తలు