• తాజా వార్తలు

క్రెడిట్ కార్డ్ లేకుండా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌, ఫ్రీ ట్ర‌య‌ల్ పొంద‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

నెట్‌ఫ్లిక్స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా పాపుల‌ర‌యిన యాప్‌. ఇందులో మూవీస్‌, షోలు,  ఇత‌ర వీడియోలు అల్ట్రా హెచ్‌డీ క్వాలిటీతో వ‌స్తుండ‌డంతో దీనికి మంచి యూజ‌ర్ బేస్ ఏర్ప‌డింది. అయితే ఇండియాలో మాత్రం నెట్‌ఫ్లిక్స్ అంత‌గా క్లిక్ కాలేదు.  దీని స‌బ్‌స్క్రిప్ష‌న్ నెల‌కు క‌నీసం 500తో ప్రారంభ‌మ‌వుతుంది. అంతేకాదు ఇంట‌ర్నేష‌న‌ల్ స‌పోర్టెడ్ క్రెడిట్ /  డెబిట్‌ కార్డు ఉంటే త‌ప్ప నెట్‌ఫ్లిక్స్‌కు పే చేయ‌లేక‌పోవ‌డం కూడా ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ పెద్ద‌గా క్లిక్ అవ‌క‌పోవ‌డానికి కార‌ణాల‌ని చెప్పొచ్చు. అయితే రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఇండియా అకౌంట్‌ను ఇంట‌ర్నేష‌నల్ కార్డ్ లేక‌పోయినా పేపాల్‌, గూగుల్ ప్లే వంటి పేమెంట్ ఆప్ష‌న్ల ద్వారా పే చేసే అవ‌కాశం క‌ల్పిస్తోంది. అంతేకాదు ఒక నెల‌పాటు ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ పొంద‌వ‌చ్చు.  

నెట్‌ఫ్లిక్స్ ఇండియా అకౌంట్‌ను సైన్ అప్‌, స‌బ్‌స్క్రైబ్ చేయాలంటే
1. నెట్‌ఫ్లిక్స్ యాప్ లేదా సైట్ ఓపెన్ చేయండి. 
2. జాయిన్ ఫ్రీ ఫ‌ర్ ఏ మంత్ అనే బ్యాన‌ర్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నెట్‌ఫ్లిక్స్ ప్లాన్స్ క‌నిపిస్తాయి.
3. ఈ ప్లాన్స్‌లో నుంచి మీకు న‌చ్చిన‌ది ఏదో ఒక‌టి సెలెక్ట్ చేసుకోండి.  ఎందుకంటే ఇది ఒక నెల ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ కాబ‌ట్టి మీరు ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం ఏమీ ఉండ‌దు.
4. త‌ర్వాత మీరు క‌న్ఫ‌ర్మేష‌న్ పేమెంట్ కింద 60 రూపాయ‌లు చెల్లించాలి.అయితే ఈ అమౌంట్ ఒక్క రోజులో మీకు తిరిగి వ‌చ్చేస్తుంది. 
5. అంతే మీరు సెలెక్ట్ చేసుకున్న‌ప్లాన్‌లో ఉన్న నెట్‌ఫ్లిక్స్ ఫీచ‌ర్ల‌న్నీ మీరు నెల‌రోజుల‌పాటు ఫ్రీగా చూడొచ్చు.

 

స‌బ్‌స్క్రిప్ష‌న్ ఎలా పే చేయాలి?
ఇంట‌ర్నేష‌న‌ల్ యాక్సెస్ ఉన్న డెబిట్ / క‌్రెడిట్ కార్డ్ లేక‌పోయినా కూడా నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్ పేచేయ‌డానికి కొత్త ఆప్ష‌న్లు వ‌చ్చాయి. 
1.యూనియ‌న్ బ్యాంక్ డిజిప‌ర్స్ వాలెట్ (Union Bank Digipurse) ను డౌన్లోడ్ చేసుకోండి. 
2.మీ మొబైల్ నెంబ‌ర్‌తో అకౌంట్ క్రియేట్ చేసుకుని, ఓటీపీతో వెరిఫై చేయండి.
3. ఇప్పుడు మీరు ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రాన్సాక్ష‌న్ ఫెసిలిటీ ఉన్న ఫ్రీ వ‌ర్చువ‌ల్ కార్డ్ వ‌స్తుంది.
4. డిజిప‌ర్స్‌లోకి ఏ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా మ‌నీ లోడ్ చేసుకోవ‌చ్చు.
5. నెట్‌ఫ్లిక్స్ పేమెంట్ పేజీలోకి వెళ్లి ఈ వ‌ర్చువ‌ల్ కార్డ్ ద్వారా మీ స‌బ్‌స్క్రిప్ష‌న్ పే చేయొచ్చు. 
లేదంటే Kitecash App ద్వారా కూడా పే చేయొచ్చు.

గూగుల్ ప్లే ద్వారా
గూగుల్ ప్లే ద్వారా కూడా నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్ పేచేయొచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లే పేమెంట్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఎందుకంటే వెబ్‌సైట్‌లో పేమెంట్ ఆప్ష‌న్ అందుబాటులో లేదు. గూగుల్ ప్లే ద్వారా మీ అకౌంట్‌లో ఉన్నఫ్రీ క్రెడిట్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌ను స‌బ్‌స్క్రైబ్ చేయొచ్చు. లేదంటే  ఫ్రీఛార్జి, పేటీఎం, స్నాప్‌డీల్ వంటి పేమెంట్ ఆప్ష‌న్ల‌తో గూగుల్ ప్లే క్రెడిట్స్‌ను కొనుక్కుని వాటి ద్వారా నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్ చెల్లించ‌వ‌చ్చు.

జన రంజకమైన వార్తలు