స్మార్ట్‌ఫోన్ వాడుతున్నాం అంటే కచ్చితంగా మొబైల్ డేటా ఉండాల్సిందే. ప్రతి చిన్నఅవసరానికి మన మొబైల్ డేటాను ఆన్ చేస్తాం. ఒకవేళ డేటా అయిపోతే ఇక చూడాలి మన తిప్పలు. అప్పుడు ఏదైనా అవసరం వస్తే చాలా ఇబ్బందిపడిపోతాం. ఎందుకంటే మొబైల్‌లో ఇంటర్నెట్ వాడకానికి అంతగా అలవాటు పడిపోయాం మరి. అంతేకాదు ఈ వేగవంతమై కాలంలో అరచేతిలో ఇంటర్నెట్ ఉండడం మన సమయాన్ని శక్తిని బాగా ఆదా చేస్తుంది కూడా. ఐతే మన మొబైల్ డేటా ఉన్నట్టుండి అయిపోయినప్పుడు వేరే చోట నుంచి మనకు డేటా వచ్చేస్తే ఇలా ఉంటుంది. మన అవసరం తీరుతుంది. అంతేకాదు మనం డేటా వేసుకోకుండానే పని అయిపోయిందన్న ఆనందం కూడా ఉంటుంది. అయితే మారిన సాంకేతికత ప్రకారం మొబైల్ డేటాను షేర్ చేసుకోవచ్చు. ఫైల్స్, ఫొటోలు, వీడియోలు పంచుకున్నట్లే మొబైల్ డేటాను కూడా ఒక సిమ్ నుంచి మరో సిమ్‌కు పంచుకోవచ్చు. అదెలాగో చూద్దామా..
షేర్ చేస్తున్నారిలా
ఒక మొబైల్‌లో ఉన్న బాలెన్స్‌ను అప్పు ఇచ్చుకోవడం మీకు తెలుసు కదా.. మీ స్నేహితులకు ఎపుడైనా అర్జెంట్‌గా బాలెన్స్ అవసరం అయితే మనం షేర్ బాలెన్స్ ఆప్షన్ ద్వారా మనం పంచుకోవచ్చు. అచ్చంగా షేర్ బాలెన్స్ మాదిరిగానే డేటాను కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే వీటిని ఎంబీ ఫార్మాట్లో పంపుకోవాలి. యూఎస్ఎస్‌డీ కోడ్స్ ద్వారా ఈ షేరింగ్ సాధ్యమవుతుంది. ఉదాహరణకు ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కు డేటాను ఎలా పంపుకోవాలో చూద్దాం.
1. ముందుగా ఎయిర్‌టెల్ ఫ్యామిలీ షేర్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ బాక్స్‌లో ఎయిర్‌టెల్ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయాలి.
2. జీవో బటన్ మీద క్లిక్ చేయాలి. వెంటనే మీకో ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కు వస్తుంది
3. మీ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు మీ ఎయిర్‌టెల్ డేటా షేరింగ్ ప్రక్రియ పూర్తయింది.
4. ఇప్పుడు మీ డేటాను మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకోవచ్చు. మాగ్జిమమ్ ఐదుగురితో ఒక గ్రూప్ క్రియేట్ చేసి వారికి డేటా షేర్ చేసుకునే వీలుంది.
10 ఎంబీ డేటా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే..
మీ మొబైల్ ఫోన్ నుంచి వేరే మొబైల్‌కు 10 ఎంబీ డేటాను ట్రాన్సఫర్ చేయాలంటే మీ ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ ప్యాక్ ట్రాన్స్‌ఫర్ కోడ్ స్టార్ 141 స్టార్ 712 స్టార్ 11 స్టార్ అని టైప్ చేసి మీరు ఎవరికి డేటా పంపాలి అనుకుంటున్నారో వారి నంబర్ డయిల్ చేయాలి. ఆ తర్వాత కాల్ బటన్ ప్రెస్ చేయాలి. మీ మొబైల్ స్క్రీన్ మీద వచ్చే ఆప్షన్లను ఫాలో కావాలి. 10 ఎంబీ డేటా ట్రాన్సఫర్ చేయడానికి రూ.1 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. రోజుకు ఒకసారి మాత్రమే 10 ఎంబీ డేటాను ట్రాన్సఫర్ చేసే అవకాశం ఉంది. రెండు ప్రిపెయిడ్ మొబైల్ నంబర్స్ మధ్య మాత్రమే ఈ ట్రాన్సఫర్ సాధ్యం.