గూగుల్ మనకు అందించిన టూల్స్‌లో బాగా ఉపయోగపడే వాటిలో గూగుల్ మ్యాప్స్ ఒకటి. ఆరంభం అయిన నాటి నుంచి ఇప్పటిదాకా గూగుల్ మ్యాప్స్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇటీవలే ఈ యాప్ ఒక కొత్త ఫీచర్‌ని విడుదల చేసింది దాని పేరే స్టే సేఫర్ ఫీచర్. బేటా టెస్టింగ్ తర్వాత స్టే సేఫర్ ఫీచర్‌ని ఆండ్రాయిడ్ ఫోన్లలో తీసుకొచ్చింది గూగుల్. అయితే ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవడం ఎలా? భారత్‌లో ఇప్పుడు పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ని వాడుకోవడం ఎలా?
ఎలా వాడాలంటే..
మీరు ముందుగా లేటెస్టు గూగుల్ మ్యాప్స్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ మ్యాప్ యాప్‌ని ఓపెన్ చేసి డెస్టినేషన్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత డైరెక్షన్స్ మీద క్లిక్ చేయాలి. మీకు స్టే సేఫర్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే గెట్ ఆఫ్ రూట్ అలెర్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. మీకు కుడి చేతి వైపు స్టార్ నేవిగేషన్ బటన్ చూపిస్తుంది. అయితే మీ డ్రైవర్ మార్గమధ్యంలో ఎప్పుడైనా రూట్‌ని వేరే వైపు మళ్లిస్తే మీ ఫోన్‌కు ఒక అలెర్ట్ వస్తుంది. అప్పుడు యూజర్లు ప్రస్తుత లొకేషన్‌ని, మీరు వెళ్లాల్సిన లొకేషన్‌ని చెక్ చేసుకోవాలి. ఏదైనా తేడా ఉంటే మీ స్నేహితులకు, బంధువలకు లైవ్ ట్రిప్‌ని షేర్ చేయాలి. అప్పుడు మీ జర్నీని వాళ్లు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.
భారత్‌లోనే ఎక్కువ
భద్రత కారణాల దృష్ట్యా చాలామంది క్యాబ్‌లు ప్రిఫర్ చేయడం లేదు. అందుకే ఈ అభద్రతను పోగొట్టడానికి కొత్తగా సేఫ్టీ ఫీచర్‌ని ప్రవేశపెట్టినట్లు గూగుల్ తెలిపింది. ముఖ్యంగా భారత్ లాంటి ఎక్కువ సేఫ్టీ కన్సర్న్ ఉన్న ప్రాంతంలో ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుందని గూగుల్ తెలిపింది. స్టే సేఫర్ మోర్ రిలియబుల్ అండ్ సేఫ్ అని గూగుల్ ప్రకటించింది. ఈ ఫీచర్ రావడం వల్ల డ్రైవర్లు కూడా అప్రమత్తంగా ఉంటారని ఆ సంస్థ పేర్కొంది.