రింగ్ టోన్.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి పరిచయమే ఇది. సెల్‌ఫోన్లు వచ్చిన రోజుల్లో రింగ్ టోన్లు కొత్త కొత్తవి ఎప్పటికప్పుడు మార్చుకోవడం ఒక సరదాగా ఉండేది. కానీ ఇప్పుడు చాలామంది ఫోన్లతో పాటే వస్తున్న డిఫాల్ట్ రింగ్ టోన్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే రింగ్ టోన్ గురించి అందరికి తెలుసు కానీ వీడియో రింగ్ టోన్ గురించి ఎంతమందికి తెలుసు? ..రింగ్ టోన్లు బోర్ కొట్టిన వాళ్లు ఈ వీడియో రింగ్ టోన్లు ప్రయత్నించొచ్చు. మరి ఆండ్రాయిడ్ ఫోన్లకు వీడియో రింగ్‌టోన్లను సెట్ చేసుకోవడం ఎలా?
వ్యింగ్ వీడియో రింగ్‌టోన్
ఆండ్రాయిడ్ ఫోన్లకు వీడియో రింగ్‌టోన్ సెట్ చేయడం కోసం వ్యింగ్ వీడియో రింగ్ టోన్ అనే యాప్ వచ్చింది. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే దీనిలో డిఫాల్ట్‌గా చాలా రింగ్‌టోన్‌లు ఉంటాయి. వాటితో పాటు మనకు నచ్చిన టోన్లను కూడా ఈ యాప్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ముందుగా ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోఢ్ చేసుకుని. అన్ని పర్మిషన్లు ఇచ్చి ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ క్రమంలో డిఫాల్ట్ డయిలర్, కాలింగ్ యాప్‌గా సెట్ చేసుకోవాలి. ఒకసారి ఇలా సెట్ చేసుకున్న తర్వాత వందల వీడియో రింగ్‌టోన్లను మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. భిన్నమైన భాషల్లో ఈ రింగ్‌టోన్లను మీరు ఉపయోగించుకోవచ్చు.
ప్రతి కాల్‌కి మీరు ఇలా ఒక్కో ప్రత్యేకమైన వీడియోని సెట్ చేసుకోవచ్చు. మీ స్నేహితుల కోసం కస్టమ్స్ రింగ్‌టోన్స్ కూడా ఏర్పాటు చేసుకునే వీలుంది. మీ పర్సనల్ వీడియోలను కూడా వీడియో రింగ్‌టోన్లుగా మార్చుకోవచ్చు. ఈ వీడియోకి ఒకవేళ సౌండ్ లేకపోతే ఫోన్లో ఉండే డిఫాల్ట్ సౌండ్ దానికి సెట్ అయిపోతుంది. అంటే మీకు ఫోన్ రాగానే మీకు ఫుల్ స్క్రీన్లో వీడియో రింగ్‌టోన్ వస్తుంది. మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా ఈ వీడియో రింగ్ టోన్లు కనిపిస్తాయి. వ్యాంగ్ వీడియో రింగ్ టోన్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.