• తాజా వార్తలు

మీ ఫేస్ బుక్ ఫోటో లకి స్టిక్కర్ లు యాడ్ చేయడం ఎలా?

  • - ఎలా? /
  • 7 సంవత్సరాల క్రితం /

ఫేస్ బుక్ రీసెంట్ గా ఒక ఫీచర్ ను లాంచ్ చేసింది. మీ ఫేస్ బుక్ ఫోటో లకి ఈ ఫీచర్ స్టిక్కర్ లను యాడ్ చేస్తుంది. ఫేస్ బుక్ స్టిక్కర్ లైబ్రరీ లో ఉండే ఏ ఫోటో నైనా సరే మీరు అప్ లోడ్ చేసిన ఫోటో లకి యాడ్ చేసుకోవచ్చు.ఫోటో లో ఉన్న ఏ పొజిషన్ కైనా కేవలం దానిపై డ్రాగ్ చేయడం ద్వారా ఆయా ఫోటో లకు స్టిక్కర్ లు యాడ్ చేయవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే మీరు ఈ ఫీచర్ ను ఫేస్ బుక్ యొక్క వెబ్ మరియు మొబైల్ అప్లికేషను రెండింటిలోనూ ఉపయోగించవచ్చు. ఈ ఆర్టికల్ లో మీ ఫేస్ బుక్ యొక్క ఫోటో లకు స్టిక్కర్ లు ఎలా యాడ్ చేయాలో చూద్దాం.
మొబైల్ ఫోన్ లో స్టిక్కర్ లు యాడ్ చేయడం
1. మీ ఫేస్ బుక్ టైం లైన్ లో ఉన్న ఫోటో ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇది మిమ్మల్ని పిక్చర్ లైబ్రరీ కి తీసుకెళ్తుంది.. దీనినే మీ మొబైల్ లో కెమెరా రోల్ అని అంటారు.
2. మీరు అప్ లోడ్ చేయవలసిన ఫోటో ను సెలెక్ట్ చేసుకోవాలి. స్టిక్కర్ లు, టెక్స్ట్ యాడ్ చేయడానికి మరియు క్రాప్ చేయడానికి ఇది ఒక సరికొత్త విండో లో ఓపెన్ అవుతుంది.
3. పిక్చర్ యొక్క అడుగుభాగం లో ఉండే ఎమోటికాన్ స్టిక్కర్ సెలెక్ట్ చేయండి. ఇది అక్కడ అందుబాటులో ఉన్న స్టిక్కర్ లను చూపిస్తుంది.
4. మీకు కావాల్సిన స్టిక్కర్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
5. మీరు సెలెక్ట్ చేసిన స్టిక్కర్ మీ ఫోటో యొక్క పై భాగం లో కనిపిస్తుంది. అక్కడనుండి మీరు దానిని ఎక్కడ ఉంచాలనుకుంటే అక్కడకి డ్రాగ్ చేయడం ద్వారా సెట్ చేసుకోవాలి.
6. పూర్తి అయిన తర్వాత డన్ పై క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన స్టిక్కర్ ఆ ఫోటో పై కనిపిస్తుంది.
7. ఆ తర్వాత దానిని మీ ఫేస్ బుక్ టైం లైన్ లో పోస్ట్ చేసుకోవచ్చు.
ఫేస్ బుక్ వెబ్ యాప్ లో స్టిక్కర్ లు యాడ్ చేసుకోవడం
1. వెబ్ లో కూడా దాదాపు మొబైల్ అప్లికేషను లో చేసిన విధంగానే ఉంటాయి.
2. మీ న్యూస్ ఫీడ్ లో పైన ఉన్న ఫోటోస్/వీడియోస్ పై క్లిక్ చేయాలి.
3. అప్ లోడ్ ఫోటోస్/వీడియోస్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
4. మీరు అప్ లోడ్ చేయాలి అనుకున్న ఫోటో ను సెలెక్ట్ చేసుకోవాలి.
5. స్టిక్కర్ ను యాడ్ చేయడానికి బ్రష్ లాంటి ఒక ఐకాన్ ఉంటుంది, దానిని సెలెక్ట్ చేసుకోవాలి.
6. స్టిక్కర్ ను సెలెక్ట్ చేసుకోవడానికి ఎమోటికాన్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.
7. ఆ స్టిక్కర్ ను ఫోటో పై డ్రాగ్ చేయడం ద్వారా రీ సైజు మరియు పొజిషన్ సెట్ చేసుకోవచ్చు.
8. పూర్తి అయిన తర్వాత డన్ పై క్లిక్ చేయాలి. అ తర్వాత దానిని మీ టైం లైన్ లో పోస్ట్ చేసుకోవచ్చు

జన రంజకమైన వార్తలు