• తాజా వార్తలు

గూగుల్ పే యాప్ ద్వారా రైల్వే టికెట్ బుక్ చేసుకోవడం ఎలా ? స్టెప్ బై స్టెప్ మీకోసం 

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

గూగుల్ పే యాప్ ద్వారా ఇప్పటిదాకా న‌గ‌దు బ‌దిలీలు, బిల్ పేమెంట్స్‌, రీచార్జ్లు చేసుకోవ‌చ్చ‌న్న విష‌యం అందరికీ తెలిసిందే.  వీటితో పాటు ప్ర‌స్తుతం అందులో క్యాబ్‌, బ‌స్ టిక్కెట్ బుకింగ్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. వీటితో పాటు  ఇక‌పై గూగుల్ పే యాప్‌లో రైల్వే టిక్కెట్ల‌ను కూడా బుక్ చేసుకోవ‌చ్చు. ఇండియ‌న్ రైల్వేస్‌తో భాగ‌స్వామ్యం అయిన గూగుల్ ఐఆర్‌సీటీసీతో క‌ల‌సి రైలు టిక్కెట్ల‌ను బుక్ చేసుకునే స‌దుపాయాన్ని ప్రారంభించింది. అంతే కాకుండా గూగుల్ పే యాప్ ద్వారా రైలు టిక్కెట్ల‌ను బుక్ చేసుకుంటే ఎలాంటి అద‌న‌పు చార్జిల‌ను చెల్లించాల్సి ప‌నిలేద‌ని ఐఆర్‌సీటీసీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కాగా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ల‌భిస్తున్న గూగుల్ పే యాప్‌లో యూజ‌ర్లు ప్ర‌స్తుతం ట్రెయిన్ టిక్కెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు..!
 
ఇకపై రైలు టికెట్ బుక్ చేయడానికి మీ ఫోన్‌లో ఐఆర్‌సీటీసీ యాప్ లేకపోయినా గూగుల్ పే యాప్ ఉంటే చాలు. టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, ట్రెయిన్ స్టేటస్ లాంటి సేవల్ని పొందొచ్చు. అయితే ఇలా చేయాలంటే మీకు ముందుగానే ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉండాలి. గూగుల్ పే యాప్‌లో ఐఆర్‌సీటీసీ అకౌంట్ క్రియేట్ చేయడం సాధ్యం కాదు.

ఎలా బుక్ చేయాలి
ముందుగా మీ గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి. తర్వాత కనిపించే పేజీలో 'Book train tickets' అనే ఆప్సన్ క్లిక్ చేయాలి. మీరు రైలు ఎక్కాల్సిన స్టేషన్, గమ్యస్థానం, తేదీ, కోటా వివరాలు అందులో ఎంటర్ చేయాలి. మీరు ఏ రైలు ఎక్కాలనుకుంటున్నారో దాన్ని  ఎంచుకుని  ఆ తర్వాత మీ ఐఆర్‌సీటీసీ యూజర్ నేమ్, పేరు, ఫోన్‌ నెంబర్, వయస్సు లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాతి పేజీలో ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి. 

జన రంజకమైన వార్తలు