ఎవరికైనా జిఫ్ పంపాలంటే ఏం చేస్తారు? ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి ఎవరో తయారుచేసిన జిఫ్స్ తీసుకుని సెండ్ చేస్తారు. మీ జిఫ్‌లు మీరే సొంతంగా తయారుచేసుకోవచ్చు. దీనికి ఆన్‌లైన్‌లో బోల్డన్ని టూల్స్ ఉన్నాయి. అందులో GIF Maker ఒకటి. జిఫ్ మేకర్‌తో జిఫ్ క్రియేట్ చేయడం ఎలా?
* మీరు జిఫ్ తయారుచేయాలనుకున్న వీడియో యూట్యూబ్ లేదా ఇతర వీడియో సైట్లలో ఉంటే ఆ వీడియో యూఆర్ ఎల్‌ను పేస్ట్ చేయాలి. లేదంటే మీ కంప్యూటర్ నుంచి బ్రౌజ్ చేసి ఆ వీడియోను అప్‌లోడ్ చేయొచ్చు.
* వీడియో లోడ్ కాగానే స్టార్ట్ టైమ్, ఎండ్ టూమ్, డ్యూరేషన్ సెలెక్ట్ చేయాలి. స్లైడర్స్‌ను ఎడ్జస్ట్ చేసి వీటిని సెట్ చేసుకోవచ్చు. లేదంటే మాన్యువల్‌గా కూడా మూవ్ చేసుకోవచ్చు.
* క్యాప్షన్, ట్యాగ్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు.
* ఇప్పడు Create GIF అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
* జిఫ్ జిఫీ వెబ్‌సైట్లోకి అప్‌లోడ్ అవుతోంది. ఈ లింక్ ను షేర్ చేసి మీ కంప్యూటర్లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.
GIF Makerతో ఇవన్నీ చేయొచ్చు
జిఫ్ మేకర్ తో మీరు వీడియోలతో జిఫ్‌లు క్రియేట్ చేయొచ్చు. ఇప్పటికే ఉన్న జిఫ్‌లతో జిఫ్ స్లైడ్ షో చేయొచ్చు. జిఫ్‌లకు క్యాప్షన్స్, యానిమేటెడ్ టెక్స్ట్, స్టిక్కర్స్, ఫిల్టర్స్ యాడ్ చేయొచ్చు.
* జిఫ్‌లు మరింత ఈజీగా క్రియేట్ చేసుకోవడానికి ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ల్లో క్రాస్ ఫ్లాట్‌ఫారం యాప్స్ కూడా ఉన్నాయి.