• తాజా వార్తలు

వాట్సాప్ వెబ్‌లో వీడియో కాల్స్ చేసుకోవ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 3 సంవత్సరాల క్రితం /

వాట్సాప్ మొబైల్ వెర్ష‌న్‌లో వీడియో కాలింగ్ స‌పోర్ట్ చాలాకాలంగా ఉంది. దాన్ని చాలామంది వాడుతున్నారు కూడా. అయితే వాట్సాప్ వెబ్‌లోనూ వీడియో కాలింగ్ ఫీచ‌ర్‌ను తీసుకొస్తున్న‌ట్లు వాట్సాప్ ప్ర‌క‌టించింది. దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం.

వాట్సాప్ వెబ్‌లో వీడియో కాలింగ్ ఎలా అంటే?
* మీ డివైస్‌లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయండి.
* ఎడ‌మ‌వైపు కార్న‌ర్‌లో త్రీడాట్స్ మెనూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి Create a Roomను టాప్ చేయండి. 
* ఇప్పుడు మీకు Continue in Messenger అనే మెసేజ్ వ‌స్తుంది. దాన్ని క్లిక్ చేయండి. 
* మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటేమీరు లాగిన్ అవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఫేస్‌బుక్ ఆటోమేటిగ్గా మీ పేరుతో ఓ రూమ్ క్రియేట్ చేస్తుంది.  Create Room As XXXX అని మీ పేరుతో రూమ్ వ‌స్తుంది. దాన్ని క్లిక్ చేస్తే వీడియో కాల్ స్టార్ట్ చేయొచ్చు. 
* ఇప్పుడు మీరు ఆ వీడియో కాల్ లింక్‌ను ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకివాట్సాప్ ద్వారా  షేర్ చేసి వారిని జాయిన్ అవ‌మ‌ని అడ‌గొచ్చు. 
* వాళ్లు జాయిన్ అయితే చాలు కాల్ న‌డుస్తుంది. రూమ్ క్రియేట్ చేసేవారికి ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటే చాలు. జాయిన్ అయ్యేవారికి లేక‌పోయినా ఫ‌ర్లేదు.
* ఈ వాట్సాప్ వెబ్ వీడియో కాలింగ్ ద్వారా ఫేస్‌బుక్ రూమ్స్‌లో మాదిరిగానే ఒకేసారి 50 మందితో వీడియో కాల్ మాట్లాడుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు