• తాజా వార్తలు

మీ వైఫైతో కనెక్ట్ అయిన మొత్తం డివైస్ ల వివరాలను తెలుసుకోవడం ఎలా ?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

పర్సనల్ వై-ఫై నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటున్న వారి సంఖ్య ఇండియాలో రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. కొన్నికొన్ని సందర్భాల్లో మన వై-ఫై నెట్‌వర్క్‌ను మనకు తెలియకుండానే ఇతరులు వాడేస్తుంటారు. దీంతో బ్యాండ్‌విడ్త్ డివైడ్ అయి నెట్‌వర్క్ స్పీడు పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని మీరు తరచూ ఫేస్ చేస్తున్నట్లయితే ఈ కూల్ చిట్కాను ఉపయోగించి మీ వైఫై కనెక్షన్‌కు మీరు కాకుండా ఇంకా ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారో ఫోన్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. 

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి Fing - Network Tools అనే యాప్‌ను మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత డివైస్‌లో లాంచ్ చేయాలి. యాప్ ఓపెన్ అయిన తరువాత ఆన్ స్క్రీన్ ఆప్షన్‌లను ఫాలో అవుతూ మీ వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉన్న డివైసులను స్కాన్ చేయాలి. సాన్కింగ్‌లో అటువంటి వివరాలు ఏమైనా బయటపడినట్లయితే, వెంటనే ఆయా డివైస్‌లకు సంబంధించిన మ్యాక్ అడ్రస్‌ను చెక్ చేసుకుని వాటిని మీ వై-ఫై రౌటర్‌లో బ్లాక్ చేసుకునే వీలుంటుంది.

మరొక పద్థతిలో...
మరొక పద్థతిలో భాగంగా Wifi Inspector అనే యాప్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ యాప్ సేవలను వినియోగించుకోవాలనుకునే ఆండ్రాయిడ్ యూజర్లు ముందుగా ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వై-ఫై ఇన్స్ పెక్టర్ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత డివై‌స్‌లో లాంచ్ చేయాలి. యాప్ లాంచ్ అయిన వెంటనే మీరు కనెక్ట్ అయి ఉన్న నెట్‌వర్క్‌ను యాప్ స్కాన్ చేసేస్తుంది. ఆ తరువాత "Inspect Network" ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీ వై-ఫై నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయి ఉన్న డివైసులను స్కాన్ చేయబడతాయి. సాన్కింగ్‌లో అటువంటి వివరాలు ఏమైనా బయటపడినట్లయితే, వెంటనే ఆయా డివైస్‌లకు సంబంధించిన మ్యాక్ అడ్రస్‌ను చెక్ చేసుకుని వాటిని మీ వై-ఫై రౌటర్‌లో బ్లాక్ చేసుకునే వీలుంటుంది.

ఆపిల్ ఐఫోన్‌ యూజర్లు
ఒకవేళ మీరు యాపిల్ ఐఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే Fing - Network Tools for iOS అనే యాప్‌ను మీ ఐఓఎస్ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తరువాత యాప్‌ను ఓపెన్ చేసి ఆన్‌స్క్రీన్ ఆప్షన్‌లను ఫాలో అవుతూ మీ వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉన్న డివైసులను స్కాన్ చేసుకోవాలి. సాన్కింగ్‌లో మీ వై-ఫై నెట్‌వర్క్‌ను వేరేవారు వినియోగించుకుంటున్నట్లు బయటపడినట్లయితే, వెంటనే ఆయా డివైస్‌లకు సంబంధించిన మ్యాక్ అడ్రస్‌ను చెక్ చేసుకుని వాటిని మీ వై-ఫై రౌటర్‌లో బ్లాక్ చేసుకునే వీలుంటుంది.

జన రంజకమైన వార్తలు