కొత్తగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌ను విడుదల చేసినట్లు గూగుల్ ఇటీవలే ప్రకటించింది. ఇటీవల జరిగిన ఆండ్రాయిడ్ డెవలపర్స్ సదస్సులో గూగుల్ ఈ ప్రకటన చేసింది. కొత్త ఆండ్రాయిడ్ ఎస్.. ఆండ్రాయిడ్ పీ ఇటీవల మార్కెట్లోకి వచ్చినట్లు వినియోగదారులందరూ తమ డివైజ్‌లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. దీనిలో కొత్తగా వచ్చిన ఫీచర్లను ఇప్పటికే చాలామంది యూజర్లు ఉపయోగించుకుంటున్నారు. తొలిసారి దీన్ని గూగుల్ హ్యాండ్‌సెట్లకు మాత్రమే అనే నిబంధన పెట్టలేదు. అయితే ఈ కొత్త ఓఎస్‌ను బేటా వెర్షన్‌గా మాత్రమే విడుదల చేసినట్లు గూగుల్ ఈ సదస్సులో వెల్లడించింది. మరి కొత్త ఓఎస్‌ను పొందడం ఎలా!
కొత్త ఓఎస్‌ను పొందాలంటే..
1. ముందుగా గూగుల్.కామ్ ఓపెన్ చేసి ఆండ్రాయిడ్, బేటా వెర్షన్‌లపై క్లిక్ చేయాలి
2. ఆ తర్వాత మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ కావాలి
3. స్క్రోల్ డౌన్ చేసి ఎలిజిబుల్ డివైజ్‌ను సెలక్ట్ చేసుకోవాలి
4. ఆ తర్వాత ఆప్ట్ ఇన్ వన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ డివైజ్ కనిపిస్తుంది.
5. దీనిలో ఎన్‌రోల్ కాగానే.. మీకో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ నోటిఫికేషన్ వస్తుంది.
6.ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే మాన్యువల్‌గా మీ అప్‌డేట్స్ చెక్ చేసుకోవాలి. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ తర్వాత సిస్టమ్ అప్‌డేట్ మీద క్లిక్ చేయాలి
7. అప్‌డేట్ వస్తే డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసి అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత మీ సిస్టమ్ రీస్టాట్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది.
ఏ మోడల్స్‌కు లభిస్తుందంటే..
అన్ని గూగుల్ ఫోన్లకు
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్2
షియోమి ఎంఐ మిక్స్ 2 ఎస్
నోకియా 7 ప్లస్
వొప్పో ఆర్15 ప్రొ
వివో ఎక్స్21
త్వరలో వన్‌ప్లస్ 6 ఫోన్‌కు కూడా.