గూగుల్ ప్లే స్టోర్‌లో ఉండే అన్ని యాప్‌లు ఉచితం కాదు. కొన్ని సందర్భాల్లో మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి చాలా సందర్భాల్లో యాప్స్ కొంటూ ఉంటాం. అయితే వీటి ధర ఒక్కోసారి భారీగానే ఉంటుంది. కానీ అవసరం కొద్దీ ధర ఎక్కువగా ఉన్నా మనం ఆ యాప్‌లను కొనక తప్పని పరిస్థితి ఉంటుంది. అయితే ఇలా కొనుగోలు చేసిన యాప్‌ల నుంచి కూడా మనం రిఫండ్ పొందొచ్చు. మరి అదెలాగో చూద్దామా..
రెండు గంటల్లోపే..
గూగుల్ ప్లే స్టోర్‌లో కొనుగోలు చేసిన యాప్‌ల నుంచి రిఫండ్ పొందడం చాలా సులభం. దీనికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్‌కు ఒక రిక్వస్ట్ పంపడమే. కానీ విషయం ఏమిటంటే మనం ఆ యాప్‌లను కొన్న రెండు గంటల్లోపు మాత్రమే ఈ రిక్వస్ట్ పంపే వీలుంది. ఇందుకోసం కొన్ని స్టెప్స్ మనం పాటించాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న హారిజాంటల్ లైన్స్‌ను క్లిక్ చేయాలి. అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే న్యూస్ స్టాండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆర్డర్ హిస్టరీ మీద క్లిక్ చేయాలి. మీకు రిఫండ్ కావాలనుకున్న యాప్‌ను సెర్చ్ చేయాలి. రిఫండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎస్ మీద ట్యాప్ చేయాలి. మీరు యాప్‌ను అన్ ఇనిస్టాల్ చేయగానే మీ రిఫండ్ ప్రాసెస్ మొదలైనట్టు ఈమెయిల్ వస్తుంది.
డెవలపర్‌ను ఎలా కాంటాక్ట్ చేయాలి
1. గూగుల్ ప్లే స్టోర్ యాప్‌ను ఓపెన్ చేయాలి
2. మీకు కావాల్సిన యాప్ లేదా గేమ్‌పై ట్యాప్ చేయాలి
3. ఆ యాప్ లేదా గేమ్ యాప్‌ను స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళితే చివర్లో రీడ్ మోర్ అని ఉంటుంది.
4. అక్కడే మీకు డెవలపర్స్ కాంటాక్ట్ వివరాలు లభిస్తాయి.ఇందులో ఈమెయిల్ ఐడీ కూడా ఉంటుంది.
5. మీ రిఫండ్ కావాలని అడుగుతూ ఒక మెయిల్ పంపాలి. ఎలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడకూడదు. ఆ యాప్ లేదా గేమ్‌లో ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పాలి. మీ రిజన్స్ సరిగ్గా ఉంటే మీ రిఫండ్ మీకు వచ్చేస్తుంది.