మీకు జీమెయిల్‌లో మెయిల్ వచ్చింది.. మొబైల్ యాప్ ఉంటే కొత్త మెయిల్ వచ్చినప్పుడల్లా అలర్ట్ చూపిస్తుంది. లేదంటే మనం మెయిల్ ఓపెన్ చేసి చూసుకుంటేగానీ తెలియదు. నోటిఫికేషన్ వచ్చినా అందులో అందులో పనికిరాని మెయిల్స్ కూడా చాలా ఉంటాయి.నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా ఓపెన్‌చేసి చూడడం అన్నిసార్లూ కుదరదు. అలాగని అన్నీ పనికిరాని మెసేజ్‌లు వస్తాయని కూడా చెప్పలేం.మనకు అవసరమైన మెయిల్స్ కూడా ఉండొచ్చు.అలాంటి మెయిల్స్‌వచ్చినప్పుడు మీ మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. జీమెయిల్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ (Gmail SMS Alerts) అనే క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌తో ఇది సాధ్యమవుతుంది. దాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకోండి.
1.Gmail SMS Alerts క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. తర్వాత మీ జీమెయిల్‌లోకి లాగిన్ అవ్వండి.
2. ఇప్పుడు మీకు మెయిల్ హోం పేజీ రైట్ కార్నర్‌లో SMS ఐకాన్ కనిపిస్తుంది.ఆ ఐకాన్‌ను క్లిక్ చేస్తే ఒక పాప్ అప్ మెసేజ్ కనిపిస్తుంది. అక్కడ మీ ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. Send me confirmation SMS అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.
3. మీరు SMS బటన్ క్లిక్ చేసిన వెంటనే పాప్ అప్ విండోలో set up sms rule alert కనిపిస్తుంది. దానిలో for emails sent from అనే ఫస్ట్‌బాక్స్‌లో మీకు ఇంపార్టెంట్ మెయిల్స్ ఎవరి నుంచి వస్తాయో వారి మెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత with subjects containing అనే బాక్స్‌లో మెయిల్ లేబుల్ అర్జంట్, నార్మల్ వంటివి కావాలంటే ఎంటర్ చేయండి. అర్జంట్ లేబుల్ ఎంటర్ చేస్తే ఆ సెండర్ నుంచి అర్జంట్ లేబుల్‌తో మెయిల్స్ వచ్చినప్పుడే మీకు ఎస్ఎంఎస్ అలర్ట్‌లు వస్తాయి. with subjects containing అనేది ఆప్షనల్ మాత్రమే. ఆ సెండర్ నుంచి వచ్చే అన్ని ఈ మెయిల్స్‌కు మీకు అలర్ట్‌లు రావాలంటే ఆ ఫీల్డ్‌ను ఖాళీగా వదిలేయండి. తర్వాత బాక్స్‌లో మీరు ఇంతకు ముందు ఎంటర్ చేసిన మీ మొబైల్ నెంబర్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. కింద ఉన్న Save ruleని క్లిక్ చేస్తే ఆ మెయిల్ అడ్రస్ సేవ్ అవుతుంది.
4. ఇంకో మెయిల్ అడ్రస్ ఎంటర్‌చేయాలంటే Add Rule బటన్ క్లిక్ చేయండి. ఇలా ఎన్ని మెయిల్ అడ్రస్‌లు అయినా ఎంటర్ చేయొచ్చు. దీనికి అనుబంధంగా ఉన్న స్లైడర్ బటన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసి ఈజీగా కావాల్సినన్ని మెయిల్ అడ్రస్‌లను ఎంటర్ చేయొచ్చు.
5. ఈ సెటప్ అంతా పూర్తయ్యాక మీరు యాడ్ చేసుకున్న మెయిల్ అడ్రస్‌ల నుంచి మీకు ఈమెయిల్ వస్తే వెంటనే మీ ఫోన్‌కు ఎస్ఎంస్ అలర్ట్ వస్తుంది.
డైరెక్ట్‌గా చదువుకోవచ్చు
ఎస్ఎంస్ అలర్ట్‌లో ఈమెయిల్ సబ్జెక్ట్, మెయిల్ చదవడానికి లింక్, సెండర్ మెయిల్ ఐడీ వస్తాయి. మెయిల్ లింక్‌ను క్లిక్ చేస్తే ఆ మెయిల్ ఓపెన్ అవుతుంది. అంటే మీ ఈ మెయిల్ అకౌంట్ లేదా జీమెయిల్ యాప్ ఓపెన్ చేయక్కర్లేకుండానే నేరుగా ఎస్ఎంఎస్ నుంచే మెయిల్‌ను చదువుకోవచ్చు. అలాగే మీ మెయిల్‌కు ఎవరైనా రిప్లై ఇచ్చినా కూడా ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు Compose విండో ఓపెన్ చేసి Enable SMS Alert ఐకాన్ క్లిక్ చేసత్తే మీ మెసేజ్‌కు రిప్లయివచ్చినా కూడా మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది.