కడవంత గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకువే అని ఓ సామెత. స్మార్ట్‌ఫోన్ పరిస్థితి కూడా అంతే. ఎన్నివేలు ఖర్చు చేసి ఎంత గొప్ప స్మార్ట్‌ఫోన్ కొన్నా నీళ్లలోనో లేదా ఏదన్నా లిక్విడ్‌లో పడిందంటే అంతే సంగతులు. ఇటీవల వస్తున్న ఐఫోన్లు , హై ఎండ్ శాంసంగ్ ఫోన్లు వాటర్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్‌గా వస్తున్నాయి. అయితే ఇప్పటికీ మనలో అత్యధిక మంది వాడే స్మార్ట్‌ఫోన్లు వాటర్‌లో పడినా లేదా వాటి మీద వాటర్ వంటి లిక్విడ్స్ ఏమైనా పడినా అవి పాడయిపోతాయి. వెంటనే తేరుకుంటే ఫోన్‌ను కాపాడుకునే ఉపాయాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ మీద ఓ లుక్కేయండి.
ఫోన్ నీళ్లలో పడితే వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో ముందు తెలుసుకోవాలి. అప్పుడే ఫోన్‌ను లిక్విడ్ డ్యామేజ్‌ను కాపాడుకోగలం.
ఏం చేయాలి?
* వెంటనే ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయాలి. దీంతో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం తప్పుతుంది.
* సిమ్ కార్డ్ రిమూవ్ చేయడం ద్వారా దానిలో ఉన్న డేటాను కాపాడుకోవచ్చు.
* బ్యాటరీ రిమూవ్ చేసే అవకాశం ఉంటే దాన్ని కూడా రిమూవ్ చేయండి.
* ఈ టైమ్‌లో మీకు ఎక్కడ తడి కనిపించినా మెత్తటి క్లాత్‌తో వత్తి తుడిచేయండి.
* ఫోన్‌కి ఉన్న కవర్లు, కేస్‌లు తీసేసి కనీసం రెండు రోజులపాటు దాన్ని డ్రై చేయాలి.
* ఫోన్ షోడాలో లేదా సముద్రపు నీళ్లలో పడితే వాటిలో ఉండే ఉప్పు ఫోన్ లోపలి భాగాలను తినేస్తుంది. అలాంటప్పుడు దాన్ని ఆల్కహాల్‌తో క్లీన్ చేస్తారు. అయితే దీనివల్ల ఫోన్ స్క్రీన్ దెబ్బతినే ప్రమాదం ఉంది జాగ్రత్త.
డ్రై చేయడం ఎలా?
* ఫోన్‌లో ఉన్న తడిని ఆరబెట్టే విధానమే డ్రైయింగ్. దీనికోసం మీరు హెయిర్ డ్రయర్ వాడొచ్చు. అయితే కూలింగ్ లేదా ఫ్యాన్ సెట్టింగ్‌లో మాత్రమే డ్రయర్‌ను వాడండి. హాట్ ఎయిర్ వాడితే ఫోన్ డ్యామేజ్ అవుతుంది.
* ఒక ప్లాస్లిక్ కవర్ నిండుగా బియ్యం వేసి ఫోన్‌ను దానిలో పెట్టి సీల్ చేసేయండి. ఐదారు రోజులు అలాగే వదిలేయండి. మీ ఫోన్‌లో తడినంతా బియ్యం పీల్చేసుకుంటాయి. ఇన్ని రోజులు వెయిట్ చేయగలిగే ఓపిక ఇది మంచి మెథడ్.
* షూలు, బట్టలు, బ్యాగులు కొన్నప్పుడు వాటిలోపల చిన్న సిలికా ప్యాకెట్లు ఇస్తారు కదా. వాటిని డిసికెంట్స్ అంటారు. ఈ డిసికెంట్స్ కవర్లో వేసి వాటి మధ్యలో ఫోన్ పెట్టి సీల్ చేసినా ఫోన్‌ను డ్రై చేస్తాయి.
* ఫోన్‌ను 15 నుంచి 20 నిముషాలు ఎండలో కూడా పెట్టి డ్రై చేయొచ్చు.
ఏం చేయకూడదు?
* ఫోన్‌ను షేక్ చేయకండి. ఎందుకంటే ఫోన్‌లోకి వెళ్లిన లిక్విడ్ ఇలా ఊపడం వల్ల అన్ని పార్ట్‌ల్లోకి చేరే ప్రమాదం ఉంది.
* ఫోన్‌ను ఎండలో పెట్టినప్పుడు కింద ఏదైనా టవల్ లాంటిది వేయండి. లేదంటే నేల వేడికి ఫోన్ పాడవుతుంది.