వాట్సాప్.. తిరుగులేని మెసేజింగ్ యాప్. అది మెసేజ్ ఈజీ, కావల్సినన్ని ఎమోజీలు, సింబల్స్, ఫోటోలు, వీడియోలు, ఎలాంటి ఫైల్స్‌నయినా షేర్ చేసుకోవడం, అవతలి వ్యక్తి మన మెసేజ్ చూశారా లేదో తెలుసుకోగలగడం, స్టేటస్ పెట్టుకోవడం, వాళ్ల స్టేటస్ నచ్చితే లైక్ చేయడం, కామెంట్ పెట్టడం ఒకటా రెండా వాట్సాప్ చేసిన విచిత్రాలు అన్నీ ఇన్నీకావు. కానీ ఒకే ఒక్క డ్రాబ్యాక్. మనం ఎవరికైనా వాట్సాప్ చేయాలంటే ఆ నెంబర్ కచ్చితంగా కాంటాక్స్ట్‌లో సేవ్ అయి ఉండాలి. వాట్సాప్ కంటే మన ఎస్ఎంఎస్ ఏ విషయంలోనైనా ముందుంది అంటే అది ఈ ఒక్క అంశమే. ఎందుకంటే మెసేజ్‌ను మొబైల్ నెంబర్‌ను కాంటాక్ట్స్‌లో సేవ్ చేయకుండానే నేరుగా పంపొచ్చు.
వాట్సాప్‌లో వాడుకోవాలంటే అవతలివాళ్ల నెంబర్ మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లో మస్ట్‌గా ఉండాలి. ఒక్కోసారి ఎవరికో పెద్దగా పరిచయం లేని వ్యక్తికి లేదంటే వేరేవాళ్ల అవసరాలకోసమో ఒక మెసేజ్ లేదా ఫొటో పంపాల్సి ఉంటుంది. తర్వాత ఆ నెంబర్‌తో మనకు పని లేకపోయినా దాన్ని సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే కాంటాక్ట్స్ లిస్ట్‌లో లేకపోయినా వాట్సాప్ ద్వారా మెసేజ్ లేదా ఏదన్నా షేర్ చేసుకునేందుకు మూడు మార్గాలున్నాయి
Click2Chat
క్లిక్ టు చాట్ (Click2Chat) యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసి మెసేజ్ పంపాలనుకున్న నెంబర్‌ను ఎంటర్ చేయాలి. మెసేజ్ టైప్ చేసి సెండ్ ఆప్షన్‌ను ట్యాప్ చేస్తే మీ మెసేజ్ వాట్సాప్ ద్వారా వెళిపోతుంది. ఫస్ట్ టైమ్ ఆ నెంబర్‌ను యూజ్ చేస్తే వాట్సాప్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈ యాప్ ద్వారా మీ వాట్సాప్ కాంటాక్ట్‌ల స్టోరీలు (స్టేటస్) చూడొచ్చు. మెసేజ్‌ను షెడ్యూల్ చేసి తర్వాత పంపుకునే వీలుంది.
2. డయలర్ యాప్ నుంచి..
కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో డయలర్ యాప్‌లో నేరుగా సెండ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీరు డయలర్‌లో నెంబర్ టైప్ చేసి మూడుడాట్స్ ఉన్న బటన్‌ను ట్యాప్ చేయాలి. తర్వాత send a messageను క్లిక్ చేస్తే చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో నుంచి వాట్సాప్‌ను సెలెక్ట్ చేసి తర్వాత మెసేజ్ టైప్ చేస్తే సెండ్ అవుతుంది.
3. గ్రూప్‌లో సేవ్ చేసి..
అదే వాట్సప్ గ్రూప్‌లో కాంటాక్ట్‌ను సేవ్ చేస్తే మన కాంటాక్ట్స్‌లో సేవ్ చేయక్కర్లేదు. గ్రూప్‌లోకి వెళ్లి ఆ నెంబర్‌పైన క్లిక్ చేసి వాట్సాప్ చేసుకోవచ్చు. గ్రూప్ ఇన్ఫర్మేషన్ పేజీలోకి వెళ్లి Add participant ఆప్షన్‌ను టాప్ చేసి నెంబర్ యాడ్ చేయొచ్చు. అయితే ఇది గ్రూప్ అడ్మిన్‌లు మాత్రమే చేయగలరు.