• తాజా వార్తలు

ఏమిటీ గూగుల్ వారి ఆండ్రాయిడ్ మెసేజెస్‌? ఎలా ప‌ని చేస్తుంది? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌.. ఈ రెండూ ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్నారు. వెబ్‌లోనూ, మొబైల్ యాప్‌లోనూ వాడుకోగ‌ల‌గ‌డం, రెంండింటినీ సింక్ చేసుకోగ‌ల‌గడం వాట్సాప్, ఫేస్‌బుక్ ప్ర‌త్యేక‌త‌లు. ఇప్పుడు అదే బాట‌లో గూగుల్ కూడా త‌న మెసేజ్ ఫ్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసింది.  ఇందుకోసం ఆండ్రాయిడ్ మెసేజ్ వెబ్ వెర్ష‌న్ తీసుకొచ్చింది. అలాగే ఆండ్రాయిడ్ మెసేజ్ స్మార్ట్‌ఫోన్ యాప్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ రెండింటినీ సింక్ చేసుకుంటే మీరు పీసీ మీద ప‌ని చేస్తున్న‌ప్పుడు యాప్‌తో ప‌ని లేకుండా  వెబ్ వెర్ష‌న్ నుంచే మెసేజ్‌లు పంపించుకోవ‌చ్చు. 

ఆర్‌సీఎస్‌తో లింక్‌
గూగుల్ క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, ఒపెరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌, యాపిల్ స‌ఫారీ వంటి దాదాపు అన్ని వెబ్‌బ్రౌజ‌ర్ల‌లోనూ ఆండ్రాయిడ్ మెసేజ్ ప‌ని చేస్తుంది.  వాట్సాప్ వెబ్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ల మాదిరిగానే దీనిలో కూడా టెక్స్ట్ మెసేజ్‌లు, ఇమేజ్‌లు, స్టిక్క‌ర్లు, ఎమోజీలు సెండ్ చేసుకోవ‌చ్చు. రిసీవ్ చేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ మెసేజ్ అనే అఫీషియల్ యాప్‌తో  రిచ్‌క‌మ్యూనికేష‌న్ స‌ర్వీసెస్ (RCS) ద్వారా ఆండ్రాయిడ్ మెసేజ్ వెబ్ వెర్ష‌న్‌ను సింక్ చేసుకోవ‌చ్చు. ఈ యాప్‌లో మ‌రింత సెక్యూరిటీ కోసం టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ ఉంది. జిఫ్ సెర్చ్‌, స్మార్ట్ రిప్ల‌యి లాంటి అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్లు కూడా ఉంటాయి. 

ఎలా ఉప‌యోగించాలి? 

1.Android Messages యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. 

2. అలాగే మీ పీసీ లేదా ల్యాపీలో క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, ఒపెరా, యాపిల్ స‌ఫారీ బ్రౌజ‌ర్ల‌లో ఏదో ఒక‌టి ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.

3. ఫోన్‌లో ఆండ్రాయిడ్ మెసెజ్ యాప్‌ను ఓపెన్ చేయండి.

4. యాప్ హోంపేజీలో కుడివైపున పైన క‌నిపించే మూడు డాట్స్‌ను క్లిక్ చేయండి.

5. More options మెనూను టాప్ చేసి Messages for webను సెలెక్ట్ చేయండి.

6. https://messages.android.com/ను మీ పీసీలోని బ్రౌజ‌ర్‌లో ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్‌ను ఫోన్‌తో స్కాన్ చేయండి.

7. పేజీలోడ్ అయ్యాక మీరు మెసేజ్‌ల‌ను చూడొచ్చు.  సెండ్ చేయొచ్చు. రిసీవ్ చేసుకోవ‌చ్చు.

 

జన రంజకమైన వార్తలు