ఫేస్ బుక్....ఫేమస్ సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరికీ ఫేస్ బుక్ అకౌంట్ ఉంటుంది. ఫేస్ బుక్ ఓపెన్ చేయగానే కుప్పలు తెప్పలుగా వీడియోలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని ఆటోమెటిగ్గా ప్లే అవుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో వీడియోలు ఓపెన్ చేసినప్పుడు చాలా స్లోగా ఓపెన్ అవుతాయి. దీంతో మొబైల్ డేటా కూడా వ్రుధా అవుతుంది. మరి అలాంటి సందర్భాల్లో ఫేస్ బుక్ వీడియోలను స్పీడప్ చేయడం ఎలాగో తెలుసుకుందాం.
వీడియోలు స్పీడప్ చేయడం ఎలా?
స్టెప్ 1..Fast Playback for Facebook Videos - Control Speed లింక్ను ఉపయోగించి ఆండ్రాయిడ్ యాప్ ఇన్స్ స్టాల్ చేయండి.
స్టెప్ 2...ఇంటర్ స్పేస్ ఓపెన్ చేసినప్పుడు....ఇది ఫేస్ బుక్ వీడియోను స్పీడప్ చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇంటర్ స్పేస్ సెట్టింగ్స్ ఆప్షన్ కూడా మీకు కనిపిస్తుంది. ఈ యాప్ ను ఉపయోగించి వీడియో స్పీడప్ తో సర్దుబాటు చేసిన వీడియోలను చూసేందుకు ఒక హిస్టరీ సెక్షన్ కూడా ఉంటుంది. ఇలాంటి ఆప్షన్స్ అన్నింటినీ మీరు తర్వాత ఉపయోగించుకోవచ్చు.
స్టెప్ 3...ఇప్పుడు ఫేస్ బుక్ యాప్ ఓపెన్ చేసిన కొన్ని వీడియోలను ప్లే చేయండి. ఆ తర్వాత వీడియో కోసం షేర్ ఆప్షన్ను ఉపయోగించండి. మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్నింటిని చూస్తారు. అక్కడ ఒక పాప్ అప్ కూడా ఓపెన్ అవుతుంది.
ఆప్షన్ పై క్లిక్ చేసి....తర్వాత మీరు ఫాస్ట్ ప్లేబ్యాక్ ఆండ్రాయిడ్ యాప్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోను ప్లే చేయడం స్టార్ట్ చేసిన తర్వాత...కిందిభాగాన “+”,“–” ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్ ఉపయోగించి మీరు వీడియోను స్పీడప్ చేయవచ్చు.