• తాజా వార్తలు

గూగుల్ లెన్స్ వాడ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప్రొడ‌క్ట్స్‌ను రీమోడ‌ల్ చేసుకుంటూ కొత్త ప్రొడ‌క్ట్స్‌ను లాంచ్ చేస్తూ  యూజ‌ర్ల ఆద‌ర‌ణ పొందుతోంది. తాజాగా గూగుల్ ఫొటోస్‌లోనే గూగుల్ లెన్స్ అనే కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.  ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ టెక్నాల‌జీతో ఈ గూగుల్ లెన్స్‌ను డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ రెండింటిలోనూ ఈ కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి తెచ్చింది.

ఏంటి ఉప‌యోగం?

* మీరు తీసిన ఫొటో మీద క్లిక్ చేసి ఈ గూగుల్ లెన్స్ ఆన్ చేస్తే ఆ ఫోటో ఎక్క‌డ తీశారో చెబుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు చార్మినార్ ముందు నుంచి ఫొటో దిగారు. దానిమీద గూగుల్ లెన్స్ క్లిక్ చేస్తే చార్మినార్ వివ‌రాల‌న్నీ చూపిస్తుంది. 

* మీ వెన‌క సోనీదో, ఎల్జీదో, పేటీఎందో ఏదైనా యాడ్ హోర్డింగ్స్ ఉన్నాయనుకోండి వాటిమీద పేర్లు ఫొటోలో ఉంటే ఆ కంపెనీ గురించి కూడా వివరాలిస్తుంది.

* అంతేకాదు గూగుల్ లెన్స్‌ను ఏదైనా ప్రొడ‌క్ట్ బార్‌కోడ్ మీద పెట్టి స్కాన్‌చేస్తే ఆ ప్రొడ‌క్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్ అంతా చూపిస్తుంది. 

* అయితే  ప్లేస్ బాగా ఫేమ‌స్ అయి ఉండాలి. లేదంటే ఆ ఫొటోలో పేర్లు, అక్ష‌రాలు క్లియ‌ర్‌గా క‌నిపిస్తుండాలి. అప్పుడే ఇన్ఫ‌ర్మేష‌న్ ఈజీగా గూగుల్ ఏఐ సెర్చ్ చేసి ఇవ్వ‌గ‌ల‌దు.

ఆండ్రాయిడ్‌లో వాడుకోవాలంటే 

1. ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఇప్ప‌టికే మీ ఫోన్‌లో ఉన్న గూగుల్ ఫోటోస్ యాప్‌ను అప్‌డేట్ చేయండి. 

2. గూగుల్ ఫోటోస్ యాప్‌ను ఓపెన్ చేసి ఏదైనా ఒక ఫోటోను సెలెక్ట్ చేయండి.

3. కింద ఆప్ష‌న్ల‌లో కెమెరా సింబ‌ల్‌తో క‌నిపించే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి.

4. మీ ఫొటోలో ఉన్న పేర్లు, ప్లేస్‌ల‌ను బ‌ట్టి వాటి వివ‌రాల‌ను చూపిస్తుంది.  ఒక‌వేళ ఆ వివరాలు చూపించ‌లేక‌పోతే  what can Google lens do? అని బ్లూక‌ల‌ర్‌లో క‌నిపించే లెట‌ర్స్‌ను క్లిక్ చేస్తే గూగుల్ లెన్స్ చేయ‌గ‌ల ప‌నులేమిటో చూపిస్తుంది.

ఐవోఎస్‌లో గూగుల్ లెన్స్ వాడాలంటే
1. ఇప్ప‌టికే మీ ఫోన్‌లో ఉన్న గూగుల్ ఫోటోస్ యాప్ ఉంటే యాప్ స్టోర్‌లోకి వెళ్లి  అప్‌డేట్ చేయండి. యాప్ లేక‌పోతే డౌన్‌లోడ్ చేసుకోండి.

2. గూగుల్ ఫోటోస్ యాప్‌ను ఓపెన్ చేసి ఏదైనా ఒక ఫోటోను సెలెక్ట్ చేయండి.

3.  ఆప్ష‌న్ల‌లో కెమెరా సింబ‌ల్‌తో క‌నిపించే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి.

4. మీ ఫొటోలో ఉన్న పేర్లు, ప్లేస్‌ల‌ను బ‌ట్టి వాటి వివ‌రాల‌ను చూపిస్తుంది.  ఒక‌వేళ ఆ వివరాలు చూపించ‌లేక‌పోతే  what can Google lens do? అని బ్లూక‌ల‌ర్‌లో క‌నిపించే లెట‌ర్స్‌ను క్లిక్ చేస్తే గూగుల్ లెన్స్ చేయ‌గ‌ల ప‌నులేమిటో చూపిస్తుంది.

ప్ర‌స్తుతానికి గూగుల్ లెన్స్ గూగుల్ ఫోటోస్‌, గూగుల్ అసిస్టెంట్‌కు మాత్ర‌మే ప‌నిచేస్తుంది.  త్వ‌ర‌లో మ‌రిన్నియాప్స్‌కు దీన్ని అనుసంధానం చేయాల‌ని గూగుల్ క‌స‌రత్తు చేస్తోంది.
 

జన రంజకమైన వార్తలు