ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే యాప్ వాట్సాప్. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరూ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. అయితే వాట్సాప్ లో ఇంగ్లీష్ లో ఫాస్ట్ గా టైపింగ్ చేయడం అందరికీ అంత ఈజీ కాకపోవచ్చు. కానీ వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్ తో తెలుగులో కూడా టైప్ చేయవచ్చు. తెలుగుతో సహా 10 భారతీయ భాషలను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ లో మనకు కావాల్సిన భాషను ఎలా సెలక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం.
తెలుగులో టైప్ చేయడం ఎలా...
*ముందుగా వాట్సాప్ ను ఓపెన్ చేయండి
* మెనూ బటన్ను నొక్కండి.
* సెట్టింగ్స్ కు వెళ్లండి.
* యాప్ లాంగ్వేజ్ ను ఓపెన్ చేయండి
* మీకు కావాల్సిన భాషను ఎంచుకోండి.
* మీకు కావాల్సిన భాషను సెలక్ట్ చేసుకోవడం మీ ఫోన్ పై ఆదారపడి ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, పంజాబీ, తెలుగు, మరాఠి, తమిళ్, ఉర్దూ, గుజరాతీ, కన్నడ, మలయాళం ఈ భాషలన్నీ కూడా వాట్సాప్ లో అందుబాటులో ఉంటాయి.
అయితే యూజర్లను కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. వాట్సాప్ మీరు సెలక్ట్ చేసుకున్న భాషను అనుసరిస్తుంది. ఉదాహరణకు మీరు హిందీ భాషను ఎంచుకున్నారనుకోండి...ఆటోమెటిగ్గా మీ వాట్సాప్ లో హిందీ భాష ఉంటుంది. అది మీ ఫోనుపై ఆదారపడి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఏ ఫోన్ అయినా సరే.
ఆండ్రాయిడ్ ఫోన్లో భాషను ఎలా సెలక్ట్ చేసకోవాలి....
* సెట్టింగ్స్ యాప్ ను ఓపెన్ చేయాలి.
* లాంగ్వేజ్ ఇన్ పుట్ పై ట్యాప్ చేయాలి.
* భాషలను ఓపెన్ చేయాలి.
*మీకు కావాల్సిన భాషను ఎంచుకోండి
*ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన టెక్ట్స్ ను టైప్ చేయండి.
ఐఫోన్స్ లో ఎలా ఎంచుకోవాలి.....
* సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి
* జనరల్ ను ట్యాప్ చేయండి
* లాంగ్వేజ్ అండ్ రిజన్ కు వెళ్లండి
*ఇప్పుడు ఐఫోన్ భాషను ఎంచుకోండి
*మీకు కావాల్సిన భాషను సెలక్ట్ చేసుకోండి
*వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఎంచుకున్న భాషలో టెక్ట్స్ టైప్ చేయండి.