స్మార్టుఫోన్లు.. ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది మొమరీనే. మెమొరీ ఎంత బాగుంటే ఆ స్మార్టుఫోన్‌కు అంత విలువ ఉంటుంది. ఎక్కువ మెమెరీ సామర్థ్యం ఉన్న ఫోన్లను కొనడానికే వినియోగదారులు కూడా ఇష్టపడతారు కూడా. చాలా ఫోన్లలో ఎంత స్టోరేజీ ఉన్నా మెమెరీ సరిపోవట్లేదు అనే సందేశం రావడం మామూలే. దీనికి కారణం మనం ఎక్కువ ఫొటోలు, వీడియోలను స్టోర్ చేయడం పాటు ఎక్కువ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడమే. అయితే వేలాది రూపాయిలు పెట్టి పోసి కొన్న ఫోన్లలో ఇలా మెమెరీ సమస్య వస్తే చాలా ఇరిటేషన్‌గా ఉంటుంది. ఐతే ఈ మెమెరీ సమస్యను ఎక్సట్రనల్ ఎస్‌డీ కార్డు ద్వారా పరిష్కరించుకోగలిగితే.
మార్స్ మాలో వెర్షన్ వరకే..
అవును. స్మార్టుఫోన్‌లో ఎక్స్‌ట్రనల్ ఎస్‌డీ కార్డ్‌ని ఇంటర్ననల్ మెమెరీ కార్డుగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మైక్రోఎస్‌డీ కార్డుని ఎక్స్‌ట్రనల్ స్టోరేజ్‌గా ఉపయోగించుకోవచ్చు. అయితే దీనికి ఆండ్రాయిడ్ మార్ష్‌మెల్లో వెర్షన్ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్ష్ మెల్లో వెర్షన్‌తో వస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ సదుపాయం ఉంటుంది. మన మార్ష్‌మెల్లో వెర్షన్ ఉన్న మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఎస్‌డీ కార్డు పని చేస్తుందో లేదో చూసుకోవాలి. స్మార్టుఫోన్లో సెట్టింగ్ ఆప్షన్‌కు వెళ్లి స్టోరేజ్ అండ్ యూఎస్‌బీ సెక్షన్‌ను క్లిక్ చేయాలి. పోర్ట్‌బుల్ స్టోరేజ్ సెక్షన్లో ఉన్న ఎక్సట్రనల్ ఎస్‌డీ కార్డు ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
సులభమే..
ఎక్సట్రనల్ ఎస్‌డీ కార్డు ఆప్షన్ ను క్లిక్ చేశాక మూడు డాట్స్ ఉన్న మెనూ కనిపిస్తుంది. దానిపై కుడి వైపు టాప్‌లో ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే ఎజెక్ట్, ఫార్మాట్, ఇంటర్నల్, మూవీ మీడియా అనే నాలుగు ఆప్షన్లు కనబడతాయి. అప్పుడు ఇంటర్నల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీ మైక్రో ఎస్‌డీ కార్డు పూర్తిగా ఎరైజ్ అవుతుంది అనే సందేశం వస్తుంది. అప్పుడు ఎరైజ్ అండ్ ఫార్మాట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈ ప్రొసెస్ పూర్తయ్యాక మీ ఎక్సట్రనల్ ఎస్‌డీ కార్డ్ ఇంటర్నల్ స్టోరేజ్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.