ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లో కెమెరా చాలా కీలకమైన ఆప్షన్. సాధారణంగా పిక్సల్ సామర్థ్యాన్ని బట్టే ఆండ్రాయిడ్ ఫోన్లను ఎంచుకుంటూ ఉంటారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో కెమెరా అంటే ఫ్రంట్, రేర్ కెమెరాలు ఉంటాయి. ఫ్రంట్ కెమెరా పిక్సల్ సామర్థ్యాన్ని బట్టి కూడా ఫోన్ రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో వెబ్‌కామ్ ఉండదు. మన ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు తీసుకోవడం వరకు పరిమితం అవుతుంది. మహా అయితే వీడియాలు తీసుకోవచ్చు. కానీ ల్యాప్‌టాప్‌లో ఉన్నట్లుగా వెబ్‌కామ్‌గా ఉపయోగపడదు. ఐతే ఆండ్రాయిడ్ స్మార్టుపోన్‌ను వెబ్‌కామ్‌గా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
డ్రాయిడ్ కామ్
గూగుల్ ప్లే స్టోర్ నుంచి డ్రాయిడ్ కామ్ అనే యాప్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. డ్రాయిడ్‌కామ్ వెబ్ క్లైయింట్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ డ్రాయిడ్ కామ్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను మూడు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి యూఎస్‌బీ ద్వారా రెండు వైఫై, మూడు వైఫై సర్వర్‌తో. అయితే ఇలా చేయాలంటే ముందు మన స్మార్ట్‌ఫక్షన్, ల్యాప్‌టాప్ ఒకే వైఫై కనెక్షన్‌తో కలిసి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. మీ స్మార్టుఫోన్‌లో ఆండ్రాయిడ్ కామ్‌ను ఓపెన్ చేసి వైఫై ఐపీ, డ్రాయిడ్ కామ్ పోర్ట్ వివరాలను నోట్ చేసుకోవాలి. మన ల్యాప్‌టాప్‌లో డ్రాయిడ్‌కామ్ క్లైయింట్‌ను ఓపెన్ చేసి వైఫై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అందులో వైఫై ఐపీ, డ్రాయిడ్‌కామ్ పోర్ట్ వివరాలు ఎంటర్ చేయాలి. ఆడియో, వీడియో ఆప్షన్లు క్లిక్ చేసి స్టార్ట్ బటన్ నొక్కాలి. అంతే మీ స్మార్ట్‌ఫోన్ వెబ్‌కామ్ అయిపోతుంది.
యూఎస్‌బీ ద్వారా..
యూఎస్‌బీ ద్వారా కూడా మన స్మార్ట్‌ఫోన్‌ను వెబ్‌కామ్‌గా మార్చుకోవచ్చు అదెలాగో చూద్దాం. మొదట ల్యాప్‌టాప్‌లో యూఎస్‌బీ డ్రైవర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏడీబీ ద్వారా యూఎస్‌బీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి... మన స్మార్ట్‌ఫోన్లో యూఎస్‌బీ డీబగింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇలా చేయాలంటే ముందుగా సెట్టింగ్స్‌కు వెళ్లి డెవలరప్ ఆప్షన్స్‌కు వెళ్లి అనేబుల్ యూఎస్‌బీ డీబగిగంగ్ ఎంచుకోవాలి. ఏడీబీ ద్వారా మీ డివైజ్ కనెక్ట్ అయి ఉందో లేదో చెక్ చేయాలి. ఇలా చేశాక డ్రాయిడ్‌కామ్ వెబ్ క్లైయింట్ దగ్గరకు వెళ్లి యూఎస్‌బీ టాబ్‌ను నేవిగేట్ చేయాలి. స్టార్ట్‌పై క్లిక్ చేయాలి.
వైఫై సర్వర్ ద్వారా..
ఈ సదుపాయం కేవలం డ్రాయిడ్‌కామ్ ఎక్స్‌లోనే లభ్యం అవుతోంది. ఇది పెయిడ్ వెర్షన్ యాప్. వైఫై సర్వర్ ద్వారా మన స్మార్ట్‌ఫోన్లో వెబ్‌కామ్‌ని యాక్సెస్ చేయాలంటే మన ల్యాప్‌టాప్‌లో వైఫై సర్వర్ పీసీ మెనూకు వెళ్లాలి. స్టార్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. స్మార్టుఫోన్ యాప్‌లో మూడు డాట్స్ ఉన్న మెనూకి వెళ్లి కనెక్ట్ టు ఏ సర్వర్ పై క్లిక్ చేయాలి. ల్యాప్‌టాప్ లోకల్ ఐపీ అడ్రెస్ ఎంటర్ చేసి స్టార్ట్ బటన్ నొక్కాలి. ఈ మూడు ఆప్షన్లు ఉపయోగించడం వల్ల మన స్మార్టుఫోన్‌ను కూడా వెబ్‌కామ్‌గా వాడుకోవచ్చు.