టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఈమెయిల్ రాయడానికి మాత్రం టెక్నాలజీపరంగా ఎలాంటి అప్‌డేట్ రావట్లేదు. మనమే కష్టపడి రాయాల్సిందే అని నిట్టూరుస్తున్నారా? అయితే ఇకపై చింత లేదు. గూగుల్ ఈ సమస్యకు పరిష్కారంగా స్మార్ట్ కంపోజ్ అనే ఫీచర్‌ను జీమెయిల్‌లో ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఇంకా ప్రజలందరికీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ప్రయోగాత్మకంగా రీడిజైన్ చేసిన ఈ మెయిల్‌లోనే ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
స్మార్ట్ కంపోజ్ ఫీచర్ అంటే?
స్మార్ట్ కంపోజ్ ఫీచర్ ఆర్టిఫిఫియల్ ఇంటిలిజెన్స్‌తో పని చేస్తుంది. అంటే మీరు ఈ ఫీచర్‌ను ఆన్ చేసి మెయిల్ రాయడం స్టార్ట్ చేయగానే జీమెయిల్ ఆ సబ్జెక్ట్‌ను స్మార్ట్‌గా అర్ధం చేసుకుంటుంది. దాన్నిబట్టి ఎలాంటి ఫ్రేజ్ వాడాలి, ఎలాంటి పదాలు వాడాలో మీకు రికమండ్ చేస్తుంటుంది. అంటే మనం టైప్ చేస్తుంటే ఆటోమేటిగ్గా వర్డ్స్ వచ్చినట్లు అన్నమాట. దీంతో మీకు మెయిల్ రావడం చాలా సులువుగా, స్పీడ్‌గా అవుతుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడం కూడా ఉండదు.
స్మార్ట్ కంపోజ్ ఎలా వాడాలి?
1.గూగుల్ స్మార్ట్ కంపోజ్ ఫీచర్ వాడాలంటే ముందు జీమెయిల్‌లోకి వెళ్లాలి. టాప్ కార్నర్‌లో ఉన్న గేర్ ఐకాన్‌ను క్లిక్ చేసి Settingsలోకి వెళ్లాలి.
2. general టాబ్ కింద Experimental access యాక్సెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది . ఆ బాక్స్‌ను చెక్ చేసి కిందికి స్క్రోల్ చేయాలి. అక్కడ Save Changes కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.
3 ఇప్పుడు మళ్లీ జనరల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
4. General టాబ్ కింద Smart Compose అనే ఆప్షన్ కనిపిస్తుంది. Writing suggestions on ను సెలెక్ట్ చేసి కింద ఉన్న Save Changes బటన్‌ను క్లిక్ చేయాలి. అంటే మీ జీమెయిల్‌లో స్మార్ట్ కంపోజ్ ఫీచర్ అనేబుల్ అయినట్లే.
5. ఇప్పుడు జీమెయిల్ హోం పేజీలోకి వెళ్లి writing a new email బటన్ నొక్కండి. ఈ మెయిల్ అడ్రస్ రాసి, సబ్జెక్ట్ రాసి, మెయిల్ బాడీలోకి వెళ్లి కర్సర్ ఫస్ట్ లైన్‌లోకి రాగానే మీకు సజెషన్స్ రావడం స్టార్టవుతుంది. ఆ సజెషన్ మీ మెయిల్‌కు సరిపడేలా ఉంటే టాబ్ బటన్ నొక్కి కంటిన్యూ చేయొచ్చు.