• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో EPF accountని transfer చేసుకోవడం ఎలా ? స్టెప్ బై స్టెప్ మీకోసం 

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగంలా ప్రైవేట్ ఉద్యోగం పర్మింనెట్ గా ఉండదు. ఎక్కడ ఉద్యోగం, వేతనం బాగుంటే అక్కడి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో పీఎఫ్ అకౌంట్ కూడా అక్కడికి మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉద్యోగం మారినా పీఎఫ్ అకౌంట్ నెంబర్ మార్చుకోవాల్సిన పని లేదు. ఈపీఎఫ్ఓ ప్రతి ఉద్యోగికి పర్మినెంట్ UAN ఐడీ ఈస్తుంది. దీని ఆధారంగానే ఉద్యోగం మారినా పీఎఫ్ అకౌంట్‌లో మార్పు ఉండదు. అయితే ఈ పీఎఫ్ అకౌంట్‌ను పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్‌లో మీ శాలరీలోని కొంతమొత్తంతో పాటు యాజమాన్యం కూడా కొంత శాతం కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ అకౌంట్‌ను ఆన్ లైన్ ద్వారా మార్చుకోవచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మార్చుకోవచ్చు.మరి దాన్ని మార్చుకోవడం ఎలాగో చూద్దాం. 


ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్లో... https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ లాగిన్ కండి. అక్కడ మీ UAN నెంబర్, పాస్‌వర్డ్ టైప్‌తో ఎంటర్ అవండి.

ఆ తర్వాత ఆన్‌లైన్ సర్వీసెస్‌లోని 'One Member - One EPF Account (Transfer Request)' ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఈమెయిల్, పేరు, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ధృవీకరించుకోవడం మంచిది.

Get details పైన క్లిక్ చేయండి. అప్పుడు మీ గత కంపెనీకి చెందిన పీఎఫ్ ఖాతా వివరాలు చూడగలుగుతారు.

ఆ తర్వాత పాత కంపెనీ లేదా కొత్త కంపెనీ నుంచి ధృవీకరించిన ఆధారాలు ఉండాలి. మీరు పాత కంపెనీని ఎంచుకోవచ్చు. అక్కడ మెంబర్ ఐడీ, యూఏఎన్ నెంబర్ ఇవ్వాలి.

ఇది పూర్తయ్యాక తదుపరి దశలో మీకు OTP వస్తుంది. క్లిక్ చేసి సబ్‌మిట్ చేస్తే, ఈపీఎఫ్ఓ వద్ద రిజిస్టర్డ్ మీ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. OTPని అక్కడ ఇచ్చిన బాక్స్‌లో ఎంటర్ చేసి, సబ్‌మిట్ పైన క్లిక్ చేయండి.

ఆ తర్వాత మీరు ఫాం 13ని నింపవలసి ఉంటుంది. ప్రస్తుత, పాత కంపెనీల పీఎఫ్ అకౌంట్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాలి. ట్రాన్సఫర్ క్లెయిమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత సబ్‌మిట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత పది రోజుల్లో  ప్రాసెస్ పూర్తవుతుంది.

జన రంజకమైన వార్తలు