స్మార్ట్‌ఫోన్... మనకు బాగా ఇష్టమైన వస్తువు. ఎందుకంటే దీంతో ఎన్నో పనులు చక్కబెట్టొచ్చు. ప్రతి పనికి ఒక యాప్ వాడి మన సమయాన్ని, శక్తిని, డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. అయితే మనం ఆండ్రాయిడ్ ఫోన్లను ఎంతగా వాడుతుంటే వాటి శక్తి సామర్థ్యాలు రోజు రోజుకు అంతగా క్షీణిస్తాయి. అంటే వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో ఫైల్స్, వీడియోలు కూడా పెరిగిపోయి స్మార్ట్‌ఫోన్ వేగం కూడా తగ్గిపోతుంది. ఎంతగా తగ్గిపోతుందంటే మనం కొత్తగా కొన్నప్పుడే బుల్లెట్ వేగంతో పరుగెత్తిన ఫోన్.. రెండేళ్ల తర్వాత అత్యంత నెమ్మదిగా మారిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫీచర్ ఫోన్‌కు అటు ఇటుగా ఛేంజ్ అయిపోతుంది. మరి ఇలా డెడ్ స్లో అయిపోయిన స్మార్ట్‌ఫోన్‌ను తిరిగి పట్టాలెక్కించడం ఎలా? మళ్లీ వేగంగా పరుగెత్తేలా చేయడం ఎలా?
లైటర్ సోషల్ మీడియా
స్మార్ట్‌ఫోన్‌లో మనం ఎక్కువగా వాడేది సోషల్ మీడియా సైట్లనే! ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్ వాడని స్మార్టుఫోన్ వినియోగదారులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇక్కడే వచ్చింది తంటా! సోషల్ మీడియా సైట్లు మన డేటాను బాగా తినేస్తాయి. విపరీంతగా వచ్చి పడే న్యూస్ ఫీడ్, వీడియోలు, వార్తల వల్ల మన స్టోరేజ్ నిండిపోతుంది. అంతేకాదు అప్‌డేట్ అయినప్పుడల్లా ఈ యాప్‌లు స్పేస్‌ను బాగా కంజ్యూమ్ చేస్తాయి. అందుకే ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి వాటికి లైటర్ వెర్షన్‌లు వాడాలి. దీని వల్ల ఎంతో స్పేస్‌ను ఆదా చేసుకోవచ్చు
ఫాస్టర్ క్లీనర్ ఈమెయిల్
ఆండ్రాయిడ్ ఫోన్ వేగాన్ని తగ్గించే వాటిలో ఈమెయిల్ కూడా ముందంజలో ఉంటుంది. మీరు ఒకటి కంటే ఎక్కువ మెయిల్ ఐడీలు వాడడం వల్ల మీకు తెలియకుండానే చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. దీంతో మీకు ఫాస్టర్ ఎక్స్‌పీరియన్స్ తగ్గిపోతుంది. అందుకే జీమెయిల్, యాహూ, హాట్ మెయిల్, ఔట్ లుక్‌లను లైటర్ వెర్షన్‌లు వాడాలి.
క్వికర్ వెబ్ బ్రౌజింగ్
గ్రూగుల్ క్రోమ్‌లో బ్రౌజింగ్ చేయడం మనకు బాగా అలవాటు. అయితే మన ఇంటర్‌ఫేస్ లైట్‌గా ఉంటే వాయిస్ సెర్చ్, క్యూఆర్ కోడ్ స్కానర్, యాడ్ బ్లాకింగ్ లాంటి ఫీచర్లు వాడేటప్పుడు ఫోన్ స్లో అవదు. యూట్యూబ్ లాంటి వాటిని యాప్ వేసుకోకుండా నేరుగా బ్రౌజర్‌లో సెర్చ్ చేస్తే బెటర్. అంతేకాక మీకు సెర్చింగ్ కూడా సులభం అవుతుంది.
లైట్ వెయిట్, కస్టమైజబుల్ కీబోర్డు
మనకు ఆండ్రాయిడ్ ఫోన్లో కీబోర్డు కూడా మంచిగా ఉంటేనే టైపింగ్ సులభం. వేగంగా రెస్పాండ్ అయ్యే కీబోర్డులను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. గూగుల్ జీబోర్డ్ ఈ విషయంలో బెస్ట్ ఆప్షన్. దీని వల్ల జీఐఎఫ్‌లు, ఎమోజీలు ఉపయోగించడం కూడా సులభంగా ఉంటుంది.