చాలామంది వినియోగదారులు మార్కెట్లోకి కొత్త ఫోన్ రాగానే పాత స్మార్ట్ ఫోన్ ని వాడటం బోర్ కొడుతూ ఉంటుంది.అందులో భాగంగానే కొత్త ఫోన్ మోజులో పడి పాత ఫోన్ ని తక్కువ ధరకే అమ్మేస్తుంటారు. ఇలా అమ్మే సమయంలో వారు పాత ఫోన్ లోని డేటాను తీసివేయకుండా అమ్మేస్తుంటారు. అయితే ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నదనే విషయం తెలుసుకోరు. మీ డేటా మొత్తం పాత ఫోన్ లో ఉండి పోవడం వల్ల వారు మీ సమాచారాన్ని తేలిగ్గా దొంగిలించే అవకాశం ఉంది. మీ ఇంటిని మిమ్మల్ని గుల్ల చేసే అవకాశం ఉంది. కాబట్టి పాత ఫోన్ అమ్మాలనుకుంటే ఈ క్రింది సూచనలు పాటించండి. మీ డేటా మొత్తం డిలీట్ చేసిన తర్వాతే దాన్ని అమ్మండి. మరి డేటా ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం.
1. ముందుగా మీరు చేయాల్సింది మీ ఫోన్ ఫుల్ చార్జింగ్‌లో పెట్టడం. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా పూర్తికావాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఫోన్ పుల్ ఛార్జింగ్ లో ఉండాలి.
2. మీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ కానీ, ఆ తర్వాత వెర్షన్స్ కానీ అయితే, అందులో ఆండ్రాయిడ్ ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంటుంది.
3. ముందుగా మీ స్క్రీన్ లాక్ తీసేయాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్క్రీన్ లాక్‌ను తొలగించిన తర్వాత Choose None అనేదాన్ని సెలక్ట్ చేసుకోవాలి.శాంసంగ్ గెలాక్సీ హార్డ్ వేర్ అయితే Settings > Lock Screen & Security> Screen Lock కెళ్లి choose None సెలక్ట్ చేసుకోవాలి.
4. ఆ తర్వాత మీ గూగుల్ అకౌంట్‌ను తొలగించాలి. సెట్టింగ్స్ > అకౌంట్స్ > గూగుల్ లోకి వెళ్లిన తర్వాత Remove Account సెలక్ట్ చేయాలి.శాంసంగ్ అయితే Settings > Cloud & Accounts లోకి వెళ్లి రిమూవ్ అకౌంట్ సెలక్ట్ చేసుకోండి.
5. ఒకవేళ మీరు శాంసంగ్ యూజర్లు అయితే శాంసంగ్ అకౌంట్‌ను కూడా తీసేయాలి.ఇందుకోసం Settings > Lock screen & Security > Find My Mobileలో కెళ్లి పాస్ వర్డ్, అకౌంట్ టైప్ చేసి అకౌంట్ రిమూవ్ చేయాలి.
6. ఆ తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. Security > Encrypt సెలక్ట్ చేశాక డేటాను మొత్తం తొలగించవచ్చు. శాంసంగ్ వినియోగదారులు అయితే ettings > Lock Screen & Security > Protect Encrypted Dataని సెలక్ట్ చేసుకోవాలి.
7. ఆ ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలని సూచిస్తూ ఓ గైడ్ కనిపిస్తుంది. స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టండి.
8. చివరగా ఫ్యాక్టరీ రీసెట్ డేటా ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.లేకుంటే డేటా బ్యాక్ అప్ ఆప్సన్ సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ డేటా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది.