• తాజా వార్తలు

ఎయిర్‌సెల్‌, రిల‌య‌న్స్ జీఎస్ఎం, బీఎస్ఎన్ఎల్ నెట్‌వ‌ర్క్‌ల‌లో బ్యాల‌న్స్ ట్రాన్స్‌ఫ‌ర్ ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఇంత‌కుముందు మూడు నెట్‌వ‌ర్క్‌ల‌లో బ్యాల‌న్స్ ట్రాన్స్‌ఫ‌ర్ గురించి తెలుసుకున్నాం క‌దా! ఇప్పుడు మ‌రో మూడు నెట్‌వ‌ర్క్‌ల సంగ‌తి చూద్దాం:-
ఎయిర్‌సెల్‌
ఈ నెట్‌వ‌ర్క్‌లోని రెండు నంబ‌ర్ల మ‌ధ్య మెయిన్ టాక్‌టైమ్ లేదా డేటా బ్యాల‌న్స్‌ను బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా రూ.5, 10, 20, 50, 100 వ‌గైరా డినామినేష‌న్ల‌లో ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అయితే, రోజుకు ఒక‌సారి మాత్ర‌మే ఇది సాధ్య‌మ‌వుతుంది. దీనికిగాను సేవా రుసుము కింద మీ మెయిన్ బ్యాల‌న్స్‌లో కొంత త‌గ్గించ‌బ‌డుతుంది. మీ ఫోన్ నుంచి పంప‌ద‌ల‌చుకున్న వ్య‌క్తికి కాకుండా పొర‌పాటున మ‌రొక వ్య‌క్తి నంబ‌రుకు మీరు బ్యాల‌న్స్ బ‌దిలీ చేస్తే ఎయిర్‌సెల్ అందుకు బాధ్య‌త వ‌హించ‌దు.
బ్యాల‌న్స్ బ‌దిలీ ఇలా...
మీ ఫోన్ డ‌య‌ల్‌ప్యాడ్‌ను ఓపెన్ చేసి, *122*666# టైప్ చేశాక‌ డ‌య‌ల్ బ‌ట‌న్ నొక్కండి. ఇప్పుడు మీకు ఎయిర్‌సెల్ USSD మెనూ క‌నిపిస్తుంది. అందులోనుంచి మీకు కావాల్సిన ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోండి. ఆ త‌ర్వాత బ్యాల‌న్స్ స్వీక‌రించేవారి నంబ‌రు ఎంట‌ర్ చేయండి. అటుపైన ‘‘send’’ బ‌ట‌న్ నొక్కండి. అంతే... ఈ లావాదేవీకి సంబంధించిన వివ‌రాల‌న్నీ మీకు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి.
రిల‌య‌న్స్ GSM
ఈ నెట్‌వ‌ర్క్‌లో బ్యాల‌న్స్ ట్రాన్స్‌ఫ‌ర్‌కు కొన్ని నిబంధ‌న‌లున్నాయి. మీరు ఇదే నెట్‌వ‌ర్క్‌లోని మ‌రో నంబ‌రుకు బ్యాల‌న్స్ బ‌దిలీ చేయాలంటే మీ రిల‌య‌న్స్ నంబ‌రును క‌నీసం మూడు నెల‌ల‌కు మించి మీరు వాడుతున్నవారై ఉండాలి. మీరు రూ.5, 10, 20, 50, 100 డినామినేష‌న్ల‌లో రోజుకు ఒక‌సారి బ్యాల‌న్స్ బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అయితే, రూ.100కు మించి బ‌దిలీ సాధ్యం కాదు. ఈ సేవ‌కుగాను మీ బ్యాల‌న్స్ నుంచి సేవా రుసుముకింద కొంత త‌గ్గించ‌బ‌డుతుంది. మీరు పొర‌పాటున మ‌రొక‌రి నంబ‌రుకు బ్యాల‌న్స్ బ‌దిలీ చేస్తే ఆ న‌ష్టానికి రిల‌య‌న్స్ జీఎస్ఎం బాధ్య‌త వ‌హించ‌దు. 
బ్యాల‌న్స్ బ‌దిలీ ఇలా...
మీ ఫోన్ డ‌య‌ల్ ప్యాడ్ ఓపెన్ చేసి *367*3# టైప్ చేశాక కాల్ బ‌ట‌న్ నొక్కండి. ఆ త‌ర్వాత *312*3# టైప్‌చేసి, మీరు  పంపాల్సిన ఫోన్ నంబ‌రును, బ్యాల‌న్స్ విలువ‌ను, PINను (సహజంగా డిఫాల్ట్ PIN 1గా ఉంటుంది) ఎంట‌ర్ చేయండి.. అంతే! మీరు నిర్దేశించిన వ్యక్తి నంబ‌రుకు బ్యాల‌న్స్ చిటిక‌లో బ‌దిలీ అయిపోతుంది.
భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (BSNL)
మీరు క‌నీసం మూడు నెల‌ల‌కుపైగా కాలం నుంచీ BSNL వాడ‌కందారులై ఉండాలి. మీ క‌నెక్ష‌న్ ఈ నిబంధ‌న‌కు లోబ‌డి ఉన్న‌ట్ల‌యితే మీరు రూ.రూ.5, 10, 20, 50, 100 డినామినేష‌న్ల‌లో బ్యాల‌న్స్ బ‌దిలీ చేయొచ్చు. అయితే, మీరు రోజుకు రూ.100కు మించి బ‌దిలీ చేసే వీల్లేదు. మిగిలిన నెట్‌వ‌ర్క్‌ల త‌ర‌హాలోనే మీరు పొర‌పాటు నంబ‌రుకు బ్యాల‌న్స్ బ‌దిలీ చేస్తే BSNL బాధ్య‌త వ‌హించ‌దు.
బ్యాల‌న్స్ బ‌దిలీ ఇలా...
మిగిలిన ఆప‌రేట‌ర్ల‌తో పోలిస్తే BSNLలో బ‌దిలీ ప్ర‌క్రియ భిన్నంగా ఉంటుంది. ఇందులో USSD కోడ్‌కు బ‌దులు 53733 లేదా 53738 నంబ‌రుకు SMS పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ మెసేజ్ యాప్‌ను ఓపెన్ చేయండి. అందులో ఇంగ్లిష్ కేపిట‌ల్స్‌లో ‘‘GIFT’’ అని టైప్‌చేసి, స్పేస్ ఇచ్చి, బ్యాల‌న్స్ పంపాల్సిన మొబైల్ నంబ‌రును, మ‌ళ్లీ స్పేస్ ఇచ్చి పంప‌ద‌ల‌చిన బ్యాల‌న్స్ విలువ‌ను ఎంట‌ర్ చేయాలి. అటుపైన ‘send’ బ‌ట‌న్ నొక్కాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు 1234567890 నంబ‌రుకు రూ.20 బ్యాల‌న్స్ బ‌దిలీ చేయాల‌ని భావిస్తే- మీరు... ‘‘GIFT 1234567890 20’’అని టైప్ చేసి 53733 లేదా 53738 నంబ‌రుకు మెసేజ్ పంపాలి. ఆ త‌ర్వాత బ్యాల‌న్స్ బ‌దిలీ అయిన‌ట్లు మీకు నిర్ధార‌ణ మెసేజ్ వ‌స్తుంది.

జన రంజకమైన వార్తలు