షియోమి ఫోన్ వాడుతున్న వాళ్లకు యాడ్స్ ఇబ్బంది గురించి తెలిసే ఉంటుంది. మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసిన వెంటనే యాడ్స్ వచ్చి పడిపోతాయి. ఇవి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఈ యాడ్స్‌లో చాలా వరకు వల్గర్ కూడా ఉంటాయి. అందుకే ఈ యాడ్స్‌ను ఆపేయాలని షియోమి నిర్ణయించింది. రాబోయే రోజుల్లో నెమ్మదిగా ఈ యాడ్స్‌ను తీసేయాలని ఈ సంస్థ భావిస్తోంది. అయితే షియోమి మాత్రమే కాదు మీకు మీరే ఈ యాడ్స్‌ను ఆపేయచ్చు. అదెలాగో చూద్దామా..
ఎంఐయూఐ 11 ద్వారా
చాలా యాడ్ స్పేస్‌ను తగ్గించుకోవాలని షియోమి అనుకుంటోంది. ఎంఐయూఐ 11 ద్వారా రాబోయే రెండు నెలల్లో ఈ యాడ్స్‌ని పూర్తిగా కంట్రోలోకి తీసుకు రానుంది. ఇంతేకాక క్యూ క్యూ యాప్ ద్వారా వాయిస్ కాల్ రికార్డింగ్‌ను సపోర్ట్ చేయనుంది. లోకల్ రీసైకిల్ బిన్‌తో పాటు మాగ్నిఫికేషన్ షార్ట్‌కట్ లాంటి ఆప్షన్లు దీనిలో ఉన్నాయి. దీని ద్వారా యూజర్లు వేగంగా టెక్ట్, ఇమేజ్‌లు జూమ్ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం చేయచ్చు. అయితే ఈ ఫీచర్లన్ని ఫోన్లో బాగా ఇమడి పని చేయాలంటే యాడ్స్‌ని నియంత్రించడం ఒక్కటే మార్గమని షియోమి భావిస్తోంది.
ఫిర్యాదు చేస్తే..
మనం ఫోన్ ఆన్ చేయగానే ఏదో యాడ్స్ వచ్చి ఇబ్బంది పెడతాయి. ఈ మధ్య కాలంలో పబ్‌జీ యాడ్‌లు బాగా వస్తున్నాయి. నిజానికి మనం పబ్‌జీ ఆట ఆడకపోయినా ఈ గేమ్ యాడ్‌లా వస్తుంది. ఇలాంటి వాటి వల్ల యూజర్లు షియోమి వాడకాన్ని తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ గుర్తించింది. అందుకే నష్ట నివారణ చర్యలు తీసుకుంటోంది. యూజర్లు ఫిర్యాదు చేస్తే చాలు వెంటనే ఆ యాడ్స్ ఆపేస్తుంది. అంతేకాదు డిజేబుల్ యాడ్స్ అనే ఆప్షన్‌ని కూడా ఎంఐయూఐలో పెట్టింది. ఇలాంటి అనవసర యాడ్స్‌ని మనమే తీసేసుకునే అవకాశాన్ని కల్పించింది.