మనం టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ వేసుకుని బయటకు వెళితే కచ్చితంగా అన్ని డాక్యుమెంట్లు క్యారీ చేయాలి. ఒక్క డాక్యుమెంట్ మరిచిపోయినా మనకు చాలా ఇబ్బందే. మధ్యలో ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే తిప్పలు తప్పవు. అయితే మనం ఏ డాక్యుమెంట్ క్యారీ చేయకపోయినా ఇక ఫర్వాలేదు. ఎందుకంటే ఎంపరివాహన్ యాప్ ఒక్కటుంటే చాలు. మరి ఏంటి యాప్.. ఇదెలా పని చేస్తుంది?
ఫిజికల్ డాక్యుమెంట్లు అక్కర్లేదు
ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తే పెద్ద తప్పు చేసినట్లే. దొరికితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రూల్స్‌ని అతిక్రమించిన వారికి చలాన్స్ వందల సంఖ్యలో ఉంటాయి. అందుకే అన్ని రకాల డాక్యుమెంట్లు క్యారీ చేయాల్సి వస్తుంది. ఇందుకోసమే వచ్చింది పరివాహన్ యాప్. ఈ యాప్ ద్వారా మీరు మీ డాక్యుమెంట్లను కాపీలు మాదిరిగా పీడీఎఫ్, జేపీజీ, పీఎన్‌జీ ఫార్మాట్లలో సేవ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ద్వారా మనం ఈ కాపీలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ కాపీ కేవలం పరివాహన్ లేదా డిజీ లాకర్ ద్వారా మాత్రమే ఉపయోగపడతాయి.
ఈ శిక్షల నుంచి తప్పించుకోండి
కొత్తగా మారిన ట్రాఫిక్ నిబంధనల ప్రకారం మీరు కనుక ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే మీకు మోత మోగిపోవడం ఖాయం. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు జరిమానాలు మూడు రెట్లు పెరిగాయి. కొన్ని జరిమానాలు అయితే భయపెట్టేలా ఉన్నాయి. హెల్మెట్ లేకపోతే గతంలో 100, 200 ఫైన్ వేస్తే ఇకపై 1000 ఫైన్ వేయనున్నారు. ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్‌లకు ఏకంగా 5 వేలు జరిమానా విధిస్తున్నారు పోలీసులు. ఏ డాక్యుమెంట్లు లేకపోతే 10 వేలు కట్టాల్సిందే. ఇన్సూరెన్స్ లేకపోతే 4 వేలు చెల్లించాల్సిందే. ఇలాంటి జరిమానాల నుంచి తప్పించుకోవడానికి పరివాహన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసుకుని అవసమైనప్పుడు పోలీసుకు చూపిస్తే చాలు.