• తాజా వార్తలు

వాట్సాప్ లో కొత్త ఫీచర్: పిన్ టు టాప్.. ఫేవరెట్ చాట్ సెట్ చేసుకోండిలా

  • - ఎలా? /
  • 7 సంవత్సరాల క్రితం /


వాట్స్ యాప్ వాడని వారు దాదాపుగా ఎవరూ ఉండడం లేదు. మన ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్నవారంతా దాదాపుగా వాట్స్ యాప్ వాడుతున్నారు. వారంతా వాట్స్ యాప్ లో మనతో టచ్ లో ఉంటుంటారు. పర్సనల్ మెసేజింగ్ తో పాటు గ్రూపులూ ఎక్కువే. మనం ఎంతవద్దనుకున్నా మనను అడగను కూడా అడగకుండా కనీసం పదిపదిహేను గ్రూపుల్లో యాడ్ చేసేస్తున్నారు. దీంతో 24 గంటలూ వాట్స్ యాప్ మెసేజిలే .అందులో పనికొచ్చేవీ.. అవసరం లేనివి.. పాతవి, కొత్తవి.. చిరాకు తెప్పించేవి అన్నీ ఉంటున్నాయి. ఇందులో మనకు నిజంగా అవసరమయ్యేవి ఎక్కడో మరుగున పడిపోతుంటాయి. దీంతో మనం రెగ్యులర్ గా టచ్ లో ఉండాల్సిన పర్సనో.. లేదంటే గ్రూపుకో మెసేజ్ పంపాలంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి.

పిన్ చేయడం ఈజీనే..
ఇకపై ఈ కష్టానికి వాట్స్ యాప్ చెక్ పెడుతోంది. ఆండ్రాయిడ్ లో తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఈ కష్టాలను తప్పిస్తుంది. ‘పిన్ టు టాప్’ పేరిట వాట్స్ యాప్ కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తోంది. దీని ద్వారా మనకు ఇష్టమైన వ్యక్తితో చాట్ ను.. లేదా గ్రూప్ చాట్ ను నిత్యం టాప్ లో ఉండేలా చేయొచ్చు. అంటే ఆ తరువాత ఎన్ని కొత్త చాట్ లు మొదలైనా.. కొత్తగా ఎన్ని మెసేజిలు వచ్చినా ఇదే టాప్ లో ఉంటుంది.

త్వరలో ఐఓఎస్ లో..
ఇలా మూడు పర్సనల్ ఆర్ గ్రూప్ చాట్ లను ఫేవరెట్లుగా టాప్ లో ఉంచొచ్చు. వాట్సాప్‌లో టాప్‌ బార్‌లో ‘పిన్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ లో ఇది అందుబాటులోకి వచ్చేసింది. ఐఓఎస్ లో త్వరలో అందుబాటులోకి రానుంది.

తొలగించడమూ ఈజీనే..
ఇలా పిన్ చేసిన చాట్లను తరువాత మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. మూడే పిన్ చేసుకునే చాన్సుండడంతో కొత్తగా పిన్ చేయాలంటే పాతవి అన్ పిన్ చేయాలి. అప్పుడు పిన్ సింబల్ పై కాసేపు ట్యాప్ చేయాలి.. అన్ పిన్ చేయాలి.

కాగా వాట్స్ యాప్ ఈ మధ్య ఫీచర్ల మీద ఫీచర్లు తీసుకొస్తోంది. రీసెంటుగానే 200 వరకు కాంటాక్ట్స్ ను ఒకే సారి షేర్ చేసుకునే అవకాశం కల్పించింది.

జన రంజకమైన వార్తలు