• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేయడం ఎలా ?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

ప్రొవిడెంట్ ఫండ్..ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి ఉద్యోగ చివరి దశలో ఎంతో మేలు చేస్తుంది..అయితే,పీఎఫ్ ఉన్న వారు తమ అకౌంట్ నుండి ఎలా డబ్బులు తీసికోవాలి అనేది అంతగా అవగాహన ఉండక పోవచ్చు. ఖాతాదారుల సౌలభ్యం కోసం పీఎఫ్‌ను ఆన్‌లైన్‌లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ -EPFO. మీరు ఉద్యోగం చేస్తుండగానే మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మొత్తం విత్‌డ్రా చేయాలంటే మూడు సందర్భాల్లోనే సాధ్యం. రిటైర్మెంట్ తర్వాత, రెండు నెలలు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నా, రిటైర్మెంట్ కన్నా ముందే చనిపోతే నామినీ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేయడం ఎలాగో తెలుసుకుందాం. 


ముందుగా మీరు EPFO అధికారిక వెబ్‌సైట్  https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి.UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి. 
మెంబర్‌ ప్రొఫైల్ పేజీలో ‘Manage’ ట్యాబ్‌పైన క్లిక్ చేయాలి.
డ్రాప్‌డౌన్ మెనూ నుంచి KYC సెలెక్ట్ చేయాలి తర్వాతి పేజీలో ‘Online Services’ క్లిక్ చేయాలి.
డ్రాప్-డౌన్ లిస్ట్‌లో ‘Claim Form-31,19 & 10C ఎంచుకోవాలి.
మీ బ్యాంక్ అకౌంట్‌లోని చివరి నాలుగు అంకెల్ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
తర్వాతి పేజీలో ఆన్‌లైన్‌ క్లెయిమ్‌కు అనుమతి ఇవ్వాలి.
మీ కేవైసీ వివరాలను ఈపీఎప్ఓ సేకరించి ఆన్‌లైన్ పీఎఫ్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేస్తుంది.
ఆన్‌లైన్ పీఎఫ్ క్లెయిమ్‌ ప్రాసెస్ పూర్తైతే 10 రోజుల్లో మీ అకౌంట్‌లో డబ్బులు క్రెడిట్ అవుతాయి.
ఆన్‌లైన్‌లో పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవడానికి ముందు మీ కేవైసీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.

జన రంజకమైన వార్తలు