పెట్రోల్/డీజిల్ ధరలు రోజురోజుకూ పైకి దూసుకుపోతుండగా ప్రజల్లో ఆందోళన అంతకన్నా ఎక్కువ స్థాయిలో పెరిగిపోతోంది. ఈ పరిస్థితిలో వినియోగదారుల ఆందోళననే అవకాశంగా మలచుకుంటూ ఓ చక్కటి ‘‘మహా క్యాష్‌బ్యాక్’’ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన పేటీఎం మార్కెటింగ్ విభాగాన్ని అభినందించాల్సిందే. ఈ మేరకు పేటీఎం యాప్‌తో పెట్రోలు/డీజిలు పోయించుకుంటే రూ.7,500 విలువైన క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఇది ఎలా మనకు అందివస్తుందంటే...
ఎంపిక చేసిన అవుట్‌లెట్లలో మీరు పెట్రోలు లేదా డీజిల్ పోయించుకుని, పేటీఎం యాప్‌తో డబ్బు చెల్లించినప్పుడు ఈ ఆఫర్ పొందడానికి మీరు అర్హులవుతారు. దీనికింద మీకు లభించే క్యాష్‌బ్యాక్‌ను మీ బ్యాంకు ఖాతాలో పేటీఎం జమ చేస్తుంది. నాలుగు మహా నగరాల్లో రెండు రోజుల కిందట పెట్రోలు ధర... ఢిల్లీ- రూ.81.28; ముంబై- రూ.88.67; చెన్నై- రూ.84.49; కోల్‌కతా-రూ.83.14గా ఉంది. అలాగే డీజిల్ ధర... ఢిల్లీ- రూ.73.30; ముంబై- రూ.88.82; చెన్నై- రూ.77.49; కోల్‌కతా-రూ.75.15గా ఉంది.
పేటీఎం క్యాష్‌బ్యాక్‌ను పొందడం ఇలా!
ఇంధన ధరల మంట ఆకాశానికి ఎగసిపోతున్న ఈ తరుణంలో పేటీఎం ఆఫర్‌ను మూడు సులభమైన స్టెప్పులలో సద్వినియోగం చేసుకోవచ్చు.
Step 1: మీ నగరంలో ‘‘మహా క్యాష్‌బ్యాక్’’ ఆఫర్ కోసం పేటీఎం ఎంపికచేసిన జాబితాలోని పెట్రోల్ బంకుకు వెళ్లండి.
Step 2: అక్కడ మీ వాహనానికి కనీసం రూ.50 విలువైన పెట్రోలు లేదా డీజిల్ కొట్టించండి.
Step 3: ఆ డబ్బును పేటీఎం యాప్‌ద్వారా చెల్లించండి. వెంటనే ‘‘మహా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లో పాల్గొనండి’’ అంటూ మీకో ఎస్సెమ్మెస్ వస్తుంది. అందుకు మీరు అంగీకారం తెలపగానే పేటీఎం యాప్‌లోని క్యాష్‌బ్యాక్ ఆఫర్ల సెక్షన్‌కు ఓచర్లను నేరుగా పంపుతుంది.
(గమనిక: ఏయే పెట్రోల్ బంకులలో ఈ ఆఫర్ వర్తిస్తుందన్న జాబితా పేటీఎంలో ప్రస్తుతం కనిపించడంలేదు. ఇది కనిపించగానే మళ్లీ సమాచారమిస్తాం)
నిబంధనలు... షరతులు వర్తిస్తాయి:
• ఈ ఏడాది ఆగస్టు 1న మొదలైన ఈ ఆఫర్ 2019 ఆగస్టు 1వరకూ అమలులో ఉంటుంది.
• క్యాష్‌బ్యాక్ పొందాలంటే పేటీఎం యాప్‌లో ఆఫర్ల సెక్షన్ కింద ‘Get upto Rs. 7500 cashback offer’లో పాల్గొనడం ముఖ్యం.
• ఎంపిక చేసిన బంకులలో పెట్రోలు/డీజిల్‌కు మీరు పేటీఎం చేసిన 48 గంటల్లోగా యాప్‌లోని క్యాష్‌బ్యాక్ ఓచర్ల సెక్షన్‌లో ఓచర్లు అందుతాయి. వాటిని మీరు నిర్దేశిత కొనుగోళ్ల కోసం వాడుకోవచ్చు.
• తొలిసారి పెట్రోలు లేదా డీజిల్ పోయించి ఆఫర్‌ను అంగీకరించాక మళ్లీ 11వ సారి, 21వ సారి, 31వ సారి, 41వ సారి కూడా మీరు అంగీకారం తెలపాల్సి ఉంటుంది.
• ఒకే వారంలో పలుమార్లు పెట్రోలు పోయిస్తే తొలిసారి పోయించినదాన్ని మాత్రమే క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద పరిగణనలోకి తీసుకుంటారు (మిగిలిన షరతులు, నిబంధనలతోపాటు 1, 2, 3, 4, 5, 6 మరియు 10వ సారి లావాదేవీలలో లభించే క్యాష్‌బ్యాక్ గురించి పేటీఎం యాప్‌ద్వారా తెలుసుకోవచ్చు).