రుణం కావాలంటే ఒకప్పుడు నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. మరి అదే ఇప్పడు రోజుల్లోనే లోను వచ్చేస్తుంది. టెక్నాలజీ విపరీతంగా డెవలప్ కావడంతో ఇప్పుడు రోజుల్లో కాదు సెకన్లలోనే లోను వచ్చే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అలాంటిదే ఎస్‌బీఐ కార్డు లోను. ఈ కార్డు సాయంతో కేవలం 60 సెకన్లలోనే లోను వచ్చేస్తుందట. మరి 60 సెకన్లలోనే లోను ఎలా పొందాలో చూద్దామా..
ఇన్‌స్టంట్ డెబిట్‌కార్డు లోన్
భారత్‌లోనే అత్యధికమంది కస్టమర్లు ఉన్న బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనిలో డెబిట్ కార్డ్‌తో పాటు క్రెడిట్ కార్డులు కూడా ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు. ఇప్పుడు డెబిట్ కార్డును యూజ్ చేసుకుని మనం లోను పొందొచ్చు. అది కూడా ఇన్‌స్టంట్ లోను పొందొచ్చు. పీవోఎస్ లేదా పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా ఈఎంఐల సదుపాయాన్ని అందిస్తూ డెబిట్ కార్డు మనకు లోను ఇస్తుంది. లోను పొందేందుకు ఇది చాలా సులభమైన పద్ధతి. ముందుగా మీరు ఈ లోన్‌కు అర్హులా కదా అనేది తెలుసుకోవాలి. ఇందుకోసం డీసీఎంఐ అని టైప్ చేసి 567676 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.
60 సెకన్లలో అనుమతి
లోను తీసుకోవడానికి మీరు అర్హులు అయితే మీకు కేవలం 60 సెకన్లలోనే అనుమతి దొరుకుతుంది. దీనికి ఎలాంటి డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. అంతేకాక మీకు ప్రస్తుతం బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయన్నది కూడా ఈ లోన్‌కు సంబంధం ఉండదు. ఈ లోన్ అప్రూవ్ అయిపోయి వెంటనే అది ఈఎంఐలుగా కన్వర్ట్ అయిపోతుంది. దేశవ్యాప్తంగా 40 వేల మర్చంట్స్, స్టోర్స్‌లో కూడా ఈ ఈఎంఐ ఫెసిలిటీ వర్తిస్తుంది.