కాలర్ ట్యూన్ పెట్టుకోవాలంటే ఎలా? ఒకప్పుడు ఇదో పెద్ద ప్రాసెస్. మనకు నచ్చిన పాటల్ని వెతుక్కోవాలి. వాటిని సెట్ చేసుకోవాలి. నెలకు కనీసం రూ.30 కట్టాలి. అప్పుడే మనకు నచ్చిన ట్యూన్ మనం కాలర్ ట్యూన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇది జియో కాలం! రిలయన్స్ జియోలో అన్ని ఉచితమే! కాలర్ ట్యూన్ కూడా! మరి మీ ఫోన్‌లో జియో ద్వారా ఉచితంగా కాలర్ ట్యూన్ పెట్టుకోవడం ఎలాగో చూద్దామా!
జియో మ్యూజిక్ యాప్‌తో
ప్లే స్టోర్‌లో జియో మ్యూజిక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. గానా, స్పాటిఫై, సావన్ లాగే ఇది కూడా మంచి మ్యూజిక్ యాప్. అయితే మిగిలిన యాప్‌లకు దీనికి తేడా ఏంటంటే ఇది పూర్తిగా ఉచితం. కానీ ఇది ప్రైమ్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. దీంతో సాంగ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్ మోడ్‌లో వినే అవకాశం కూడా ఉంది. మిగిలిన యాప్‌లలో ఇలా ఆఫ్‌లైన్ మోడ్‌లో వినాలంటే ఏడాదికి సబ్‌స్క్రిప్షన్ కట్టాల్సి ఉంటుంది. జియో మ్యూజిక్‌లో మీకు కావాల్సిన పాటను సెర్చ్ బార్‌లో వెతుక్కోవచ్చు. మీకు కావాల్సిన ఆల్బమ్‌ను ఎంచుకుని పాటలు సెర్చ్ చేయచ్చు. మీకు ఇష్టమైన పాటలు ఎంపిక చేసుకున్న తర్వాత సెట్ జియో ట్యూన్ ఆప్షన్ నొక్కితే చాలు మీ ఫోన్‌కు ఆ సాంగ్ కాలర్ ట్యూన్‌గా సెట్ అయిపోయినట్లే. దీనికి మీకు ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. అంతేకాదు మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. అయితే రిమిక్స్ వెర్షన్ పాపులర్ ట్రాక్స్ మాత్రం కాలర్ ట్యూన్స్‌గా సెట్ చేసుకోవడం కుదరదు.
ఎస్ఎంఎస్‌తో ఎలా సెట్ చేసుకోవాలంటే...
ఎస్ఎంఎస్ పద్ధతిలో కూడా ఫ్రీ కాలర్ ట్యూన్‌ను సెట్ చేసుకోవచ్చు. కొత్తగా జియో ఫోన్ తీసుకోబోతున్న వినియోగదారులకు ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు జియో మ్యూజిక్ పద్ధతి ఉపయోగిస్తే మేలు. ఎంఎంఎస్ ద్వారా కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవాలంటే 56789 కి మెసెజ్ పంపాలి. మూవీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి.. ఆల్బమ్ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి సింగర్ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి 56789 కి ఎస్ఎంఎస్ చేయాలి.