ట్రాయ్ కొత్త నిబంధనలు వచ్చేశాయ్.. ఈ నిబంధనల ప్రకారం కేబుల్ టీవీ వాడుతున్న కస్టమర్లందరూ కచ్చితంగా తమ డేటా ప్యాక్‌లను ఎంచుకోవాలి. ఉచిత ఛానల్స్‌ను మినహాయించి మిగిలిన ఏ ఛానల్స్ తమకు కావాలో వాళ్లు స్పష్టం చేయాలి. అయితే అందరూ ఒకే కేబుల్‌ను వాడరు. ఎయిర్‌టెల్, టాటా స్కై, డిష్ టీవీ లాంటి వాటిని భారత్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం మన కొత్త డేటా ప్యాక్‌లను ఎలా ఎంచుకోవాలో చూద్దామా..
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ వాడుతున్న వాళ్లు ఎయిర్‌టెల్ అఫీషియల్ సైట్‌కు లేదా మై ఎయిర్ టెల్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఈ సైట్‌లో లేదా యాప్‌లో యూజర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లతో లాగిన్ కావాల్సి ఉంటుంది. వోటీపీ సాయంతో ఈ సైట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత బ్రాడ్‌కాస్టర్ ప్యాక్‌ను నేరుగా ఎంచుకోవచ్చు. 100 లేదా అంతకంటే ఎక్కువ ప్రి కస్టమైజ్డ్ మంత్లీ ప్యాక్‌లను సెలక్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్రతి నెలా ఎంత మొత్తం డబ్బులు చెల్లించాలో మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీరు ఆ ప్యాక్ ఓకే అనుకుంటే కన్ఫామ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఎయిర్‌టెల్ జాబితాలో ఉన్న25 ఉచిత చానల్స్‌ను కూడా కస్టమర్లు పొందొచ్చు. వీటిని తొలగించే అవకాశం మనకు లేదు. మీ నంబర్ కౌంట్ 25 నుంచి మొదలవుతుంది.
టాటా స్కై
టాటా స్కైలో కూడా దాదాపు ఎయిర్టెల్ డిజిటల్ టీవీ మాదిరిగానే ఇదే పద్ధతి అమల్లో ఉంటుంది. సబ్‌స్కైబర్లు అఫీషియల్ వెబ్‌సైట్ లేదా టాటా స్కై యాప్ ద్వారా ఈ కొత్త టారిఫ్ వివరాలు పొందొచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి కస్టమర్లు టాటా స్కై వెబ్ సైట్ లేదా యాప్‌లోకి ఎంటర్ కావాలి. టాటా స్కై ప్యాక్‌ను ఎంచుకోవాలి. క్యురేటెడ్ టాటా స్కై ప్యాక్‌ను ఎంచుకుని 100 లేదా అంతకంటే ఎక్కువ ఛానల్స్‌ను చూజ్ చేసుకోవాలి. యూజర్లు తమకు నచ్చిన చానల్స్‌ను పిక్ చేసుకోవచ్చు.
డిష్ టీవీ
డిష్ టీవీలో కూడా యూజర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా వెబ్‌సైట్‌లో కాని యాప్‌లో కాని లాగిన్ కావాలి. దీనిలో ఉన్న డిష్ కాంబో, చానల్స్, బాకెట్స్ ద్వారా మీ కొత్త టారిఫ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. సబ్‌స్కైబర్లు తమ సెర్చ్‌ను తమకు నచ్చిన చానల్స్‌కు తగ్గటుగా ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఇంగ్లిష్ చానల్స్, తెలుగు, హిందితో పాటు కిడ్స్, స్పోర్ట్స్ ఇలా అన్ని రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో డీడీ ఛానల్స్‌ను ఎంచుకోవడం తప్పని సరి. అవి తప్ప మిగిలిన ఛానల్స్‌ను ఎంచుకోవాలి.