భారత్‌లో క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ల హవా నడుస్తున్న సమయంలో మొబిక్‌విక్ వాలెట్ వచ్చింది. యూపీఐ ఫ్లాట్‌ఫాంను ఉపయోగించి అకౌంట్ టు అకౌంట్ మనీ ట్రాన్సాక్షన్లు చేయడానికి మొబిక్‌విక్ యాప్ అందరికి బాగా పనికొచ్చింది. పేటీఎం తర్వాత ఎక్కువగా ఉపయోగిస్తున్న మనీ ట్రాన్సాక్షన్ యాప్‌లలో మొబిక్‌విక్ కూడా ఒకటి. కేవలం డబ్బులు పంపడానికి మాత్రమే కాదు రీఛార్జ్ చేయడానికి, సినిమా టిక్కెట్లు బుక్ చేయడానికి కూడా మొబిక్‌విక్ బాగా ఉపయోగపడింది. అయితే మొబిక్‌విక్ నుంచి బ్యాంకుకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే ఫీజు పడుతుంది. ఇలా ఫీజు పడకుండానే మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం ఎలాగో చూద్దాం...
వాలెట్ నుంచి ఎలా పంపాలంటే...
1.ముందుగా ఒక మొబిక్‌విక్ అకౌంట్‌ను ఓపెన్ చేయాలి
2. లేటెస్ట్ వెర్షన్ మొబిక్‌విక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
3. ఆ తర్వాత మీ మొబిక్‌విక్ అకౌంట్లోకి లాగిన్ కావాలి.
4. ఇక్కడ మీకో యూపీఐ ఆప్షన్ కనిపిస్తుంది.
5. ఆ తర్వాత మొబిక్‌విక్ అకౌంట్ మొబైల్ నంబర్, బ్యాంకు అకౌంట్ వివరాలు వెల్లడించాలి
6. ఆ తర్వాత సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు. మీరు పంపాలనుకున్న అకౌంట్‌కు డబ్బులు వెళ్లిపోతాయి
7. అది కూడా 0 పర్సంట్ ఫీజుతో మీరు ఈ ట్రాన్సాక్షన్ చేయచ్చు.
రూ.10 వేల పైన ఉంచితే 6 శాతం వడ్డీ
మొబిక్‌విక్ వాలెట్‌లో మీ డబ్బులను రూ.10 వేలకు పైగా ఉంచితే 6 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది మీ మొత్తం అమౌంట్ మీద కాలిక్యులేట్ చేస్తారు. వివరాల కోసం మొబిక్‌విక్ ప్రొఫిట్ క్లబ్‌ను సందర్శించొచ్చు.మొబిక్‌విక్ రిఫర్, ఎర్న్ ప్రొగ్రామ్ ద్వారా అదనంగా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఈ వాలెట్ సైనప్ బోనస్ కూడా ఇస్తుంది. మొబిక్‌విక్ డీల్ ఆఫ్ ద డే లాంటి కొత్త ఆప్షన్లు ఇటీవలే వచ్చాయి.