ప్రపంంచంలో ఎక్కువమంది వినియోగిస్తున్న సామాజిక మాధ్యమాల్లో వాట్సప్ ఒకటి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను తప్పక డౌన్‌లోడ్ చేయాల్సిందే. అంతగా వినియోగదారుల్లోకి చొచ్చుకుపోయింది ఈ సోషల్ మీడియా సంస్థ. వాట్సప్ అంటే మనకు తెలిసింది కేవలం స్నేహితులకు మెసేజ్‌లు పంపుకోవడం, వీడియోలు షేర్ చేసుకోవడమే. ఇంకా మహా అయితే ఒక అడుగు ముందుకేసి వాట్సప్ కాలింగ్ చేస్తాం. కానీ వాట్సప్‌తో కేవలం మెసేజ్‌లు, వీడియోలు పంపుకోవడం మాత్రమే కాదు మరెన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. వాట్సప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటే కొత్త కొత్త ఫీచర్లను పొందే అవకాశాలున్నాయి. మరి వాట్సప్‌ని మీ ప్రైవేటు స్టోర్‌గా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసా?
ఎలా భద్రం చేసుకోవచ్చంటే..
1. మనకు అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది వెంటనే దాన్ని వాట్సప్‌లో భద్రం చేసుకోవచ్చు. నోట్స్, వాయిస్ మెమోస్, స్కానడ్ డాక్యుమెంట్స్ లాంటి ఫీచర్ల ద్వారా ప్రైవేటు స్టోరేజ్‌కు వాట్సప్‌ను ఉపయోగించుకోవచ్చు.
2. వెబ్ లింక్స్, డాక్యుమెంట్స్, స్క్రీన్ షాట్స్, ఇతర ఫైల్స్‌ను సేవ్ చేసుకుని వాడుకోవడానికి వాట్సప్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు కంప్యూటర్, ఆండ్రాయిడ్ ఫోన్‌కు డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి కూడా మనం వాట్సప్‌ను అనుసంధానంగా వాడుకోవచ్చు. దీనికి ఎలాంటి సైన్ అప్ చేయాల్సిన అవసరం లేదు.
3. మై నోట్స్ పేరిట ఒక ఐకాన్ క్రియేట్ చేసుకుని దానిలో మనకు కావాల్సిన నోట్స్, డాక్యుమెంట్స్, టెక్ట్ ఫైల్స్ సేవ్ చేసుకునే అవకాశం దీని వాట్సప్తో ఉంది. ఐతే ఇలా చేయాలంటే ముందుగా వాట్సప్‌లో ఒక కొత్త వర్చువల్ కాంటాక్ట్‌ను క్రియేట్ చేయాలి. మీరు ప్రైవేట్‌గా దాచుకోవాలనుకున్న ఫైల్స్‌ను ఈ కాంటాక్ట్‌కు షేర్ చేయాలి. ఆ తర్వాత ఆ సమాచారాన్ని మీకు ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. దాన్ని ఎరేజ్ చేసే వరకు ఆ సమాచారం భద్రంగా ఉంటుంది.
మీ నంబర్‌కు మీరే మెసేజ్‌లు పంపుకోవాలంటే..
సాధారణంగా మీ సొంత వాట్సప్ నంబర్‌కు మీరే మెసేజ్‌లు పంపుకోవడం సాధారణంగా సాధ్యపడదు. కానీ కొన్ని ట్రిక్‌ల ద్వారా దీన్ని మనం సాధించొచ్చు. అదెలాగో చూద్దాం.
1. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసి కొత్త గ్రూప్‌ను క్రియేట్ చేయాలి. మీ అడ్రెస్ బుక్ నుంచి ఏదైనా ఒక కాంటాక్ట్‌ను ఈ గ్రూప్‌లో యాడ్ చేయాలి. ఈ గ్రూప్‌కు ఒక పేరు పెట్టి సేవ్ చేయాలి.
2. ఇప్పుడు వాట్సప్ గ్రూప్‌కు వెళ్లి సబ్జెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎందరున్నారో కనిపిస్తుంది
3. ఆ లిస్ట్‌లో ఉన్న ఒకే ఒక పార్టిసిపెంట్ (కాంటాక్ట్)పై ట్యాప్ చేసి హోల్డ్ చేయాలి. ఆ తర్వాత రిమూవ్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అంతే... మీ వాట్సప్‌లో ఒక గ్రూప్ రూపంలో ప్రైవేట్ స్టోర్ మీ సొంతం అయినట్లే. ఇది ఫోన్ ద్వారా మాత్రమే కాదు డెస్క్‌టాప్ (వెబ్ వాట్పప్) ద్వారా కూడా మనం ఉపయోగించుకోవచ్చు.