వాట్సప్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది వాడే మెసేజింగ్ సర్వీస్. దీనిలో కేవలం మెసేజ్‌లు మాత్రమే కాక ఫొటోలు, వీడియోలు, పైల్స్ పంపడం, కాల్స్ చేయడం లాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే వాట్సప్ ద్వారా బల్క్‌గా మెసేజ్‌లు పంపడం కుదరదు. ఫొటోలకు కూడా పరిమితి ఉంది. అయితే వాట్సప్‌ను ఉపయోగిస్తూకే ఎక్కువమందికి ఏక కాలంలో మెసేజ్‌లు పంపడం ఎలా? ఇందుకోసమే ఒక యాప్ వచ్చింది. దాని పేరే వాట్సప్ బల్క్ మెసేజస్ యాప్. మరి దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే..
ఏమిటి యాప్ ప్రత్యేకత?
మాస్ వాట్సప్ మెసేజ్‌లు పంపడానికి ఈ వాట్సప్ బల్క్ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగిస్తారు. ఈ యాప్‌ని వాట్స్ బ్లాస్ట్ బల్క్ మెసేజింగ్ యాప్ అని కూడా పిలుస్తారు. ఇది మామూలు వాట్సప్ మెసేజస్ మాదిరిగానే ఉంటుంది. ఈ యాప్ కోసం ప్రత్యేకించి ఎలాంటి రిజిస్ట్రేషన్, సైన్ అప్స్ అవసరం లేదు. ఒకసారి యాప్ రిజిజ్టర్ చేసి లాంచ్ చేసిన తర్వాత దీనిలో ఒక హోం పేజీ కనిపిస్తుంది. వాట్స్ బ్లాస్ట్ పేరుతో ఇది కనిపిస్తుంది.
ఎలా ఉపయోగపడుతుంది
సాధారణ వాట్సప్‌లో ఒకేసారి ఎక్కువమంది బల్క్‌గా మెసేజ్‌లు పంపడం కుదరదు. కానీ వాట్సప్ బ్లాస్ట్‌లో మాత్రం మనకు నచ్చినన్ని మెసేజ్‌లు పంపుకోవచ్చు. ఇందుకోసం మీ ఫోన్ కాంటాక్ట్ జాబిజాతో వీలైనన్ని కాంటాక్ట్‌లు సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇందులో ఉండే క్రియేట్ కాంటాక్ట్ గ్రూప్ అనే ఆప్షన్‌ను యూజ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ జాబితాను తయారు చేశాక లోకల్ కంట్రీ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మెసేజ్ టైప్ చేసి ప్రివ్యూ చేసుకుని సెండ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు మీరు ఎంతమందికి అనుకున్నారో అంతమందికి ఈ మెసేజ్‌లు వెళిపోతాయి.