చాలామంది తమ ఫోన్ నంబర్లను పదే పదే మారుస్తుంటారు. మనం ఒక ఫోన్ నంబర్‌ను ఎక్కువకాలం ఉంచాలని ప్రయత్నించినా ఏదో సమయంలో ఆ నంబర్‌ను మార్చక తప్పదు. అయితే మనం అలా నంబర్ ఛేంజ్ చేసినప్పుడు ఒకప్పుడైతే కాల్స్, మేసేజ్‌ల గురించే ఆలోచించేవాళ్లం ఇప్పుడు ఇంటర్నెట్‌తో అనుసంధానం అయ్యాక మన జీవితమే ఈ ఫోన్ నంబర్‌తో ముడిపడినట్లు అయింది. ముఖ్యంగా వాట్సప్ నంబర్ మారిస్తే చాలా ఇబ్బందే. మరి వాట్సప్ నంబర్ మారిస్తే ఏం జరుగుతుంది..?
ఒకే ఫోన్లో వాట్సప్ నంబర్ మార్చడం
దీన్ని రెండు రకాలుగా చేయచ్చు. మొదటిది వాట్సప్‌లో ఉన్న బిల్ట్ ఇన్ ఫీచర్ ద్వారా మార్చడం ఒక పద్ధతి. రెండోది అన్ ఇన్‌స్టాల్ చేసి మళ్లీ వాట్సప్ క్రియేట్ చేయడం.
యూజింగ్ ఛేంజ్ నంబర్ ఫీచర్
అదే ఫోన్లో వాట్సప్ నంబర్‌ను మార్చడానికి వాట్సప్ ఒక నేటివ్ వేని ప్రొవైడ్ చేసింది. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఛేంజ్ నంబర్ ఫీచర్‌ని యూజ్ చేయాలి. మీ ఫోన్ నుంచి యాప్‌ను రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం ద్వారా ముందు మీ ఓల్డ్ వాట్సప్ నంబర్ డిలీట్ అవుతుంది. మీ వాట్సప్ కాంటాక్ట్స్‌లో ఆ నంబర్ ఉండదు. మీ లాస్ట్ సీన్ కూడా మాయమవుతుంది. మీ పాత చాట్స్, మీడియా కూడా మళ్లీ వస్తుంది. మీ వ్యక్తిగత, గ్రూప్ చాటింగ్‌కు కూడా ఎలాంటి ఆటంకం కలగదు.
నంబర్ మారిస్తే..
1. మీ ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి
2 ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే త్రి డాట్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఐఫోన్‌లో అయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి కింద ఉన్న చేంజ్ నంబర్ మీద క్లిక్ చేయాలి.
3. పాత, కొత్త నంబర్‌లను ఎంటర్ చేసి నెక్ట్ మీద క్లిక్ చేయాలి.
4. నోటిఫై కాంటాక్ట్స్ మీద క్లిక్ చేస్తే త్రి ఆప్షన్స్ కనిపిస్తాయి. డన్ ఫైనల్లీ, వెరిఫై నంబర్ అని. డన్ మీద క్లిక్ చేయాలి.