• తాజా వార్తలు

7000/-లోపు ధరలలో బెస్ట్ మొబైల్స్ ఏవి?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

ప్రస్తుతం బడ్జెట్ ఫోన్ల కాలం నడుస్తోంది. ఇండియన్ మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఏడువేల రూపాయల్లో స్మార్ట్ ఫోను కొనాలంటే...అంత ఈజీ కాదు. కానీ చైనా, తైవాన్ దేశాలకు చెందిన స్మార్ట్ ఫోన్ మేకర్స్ మొబైల్ మార్కెట్ నే మార్చేశాయి. ఇప్పుడు 7వేల రూపాయలకు ఎట్రాక్టింగ్ ఫీచర్లతో న్యూమోడల్స్ ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా మార్కెట్లోకి లభ్యమవుతున్నాయి. అయితే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో మొబైల్ యూజర్లు ఎగబడి కొనేస్తున్నారు. 
7వేల రూపాయల లోపు బెస్ట్ మొబైల్ మీరు కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఆర్టికల్ ఫాలో అవ్వండి. 7వేల రూపాయలు లోపున్న బెస్ట్ మొబైల్ ఫోన్ల వివరాల జాబితాను మీకందిస్తున్నాం. 

Realme C1...ధర రూ. 6,999
చైనీస్ ఒప్పో సబ్ బ్రాండ్ ఇండియా మార్కెట్లో రిలీజ్ చేసిన రియల్ మి సి1 పేరుతో నూతన స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ కంపెనీ నుంచి గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఎన్నో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. అయితే రియల్ మి సి1, 2018లోనే లాంచ్ అయింది. ఇప్పుడు రీఫ్రెష్ గా 2019లో ర్యామ్, ఆన్ బోర్డ్ స్టోరేజీతో మార్కెట్లోకి వచ్చింది. 
ఇక రియల్ మి సి1 ఫీచర్స్ చూసినట్లయితే 6.2ఇంచుల భారీ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. బ్యాక్ సైడ్ లో 13, 2 మెగాపిక్సెల్ కెమెరాలు రెండు అమర్చారు. ఫ్రంట్ సైడ్ లో 5మెగాపిక్సెల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆప్షన్ లేదు. కానీ ఫేస్ అన్ లాక్ ఫీచర్ ను అందిస్తున్నారు. ఇక బ్యాటరీ బ్యాక్ అప్ విషయానికొస్తే...4,230ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. దాదాపు 20 గంటల 23నిమిషాల పాటు బ్యాకప్ ఇస్తుంది. ఇక 4జి డ్యుయల్ వోల్ట్ కు సపోర్ట్ ఇస్తుంది. రియల్ మి సి1 ఫోన్ ఓషియన్ బ్లూ, డీప్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. 2019 రియల్ మి సి1 వెర్షన్ 2/16జిబి, 2/32జిబి, 3/32జిబి ర్యామ్ వేరియంట్లు 7వేల రూపాయలకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 
Redmi 6A...ధర రూ. 5,999
మీకు కావాల్సిన బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే రెడ్ మీ 6ఏ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లో చాలా ఫీచర్లు ఉన్నాయి. కెమెరా సెటప్, ప్రొసెసర్, ర్యామ్ అన్ బోర్డ్ స్టోరేజీ వంటి ఆప్షన్లు చాలా ఉన్నాయి. 
ఇక రెడ్మీ 6ఏ చూడటానికి చాలా డీసెంట్ గా ఉంటుంది. 13గంటల 22నిమిషాల పాటు హెడ్ వీడియోను చూడవచ్చు. దేశవ్యాప్తంగా రెండు వెర్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 2జిబి+16జిబి, 2జిబి+32జిబి ర్యామ్ వేరియంట్లు 5,999రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. 
Asus zenfone lite L1...ధర రూ.5,999
అసూస్ జెన్ ఫోన్ లైట్ ఎల్ 1 ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మూడు వేరియంట్లలో లభిస్తోంది. లైట్ ఎల్ 1 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఫోన్ డిస్ల్పే వ్యూయాంగిల్స్ చాలా డిసేంట్ గా ఉంటాయి. 3జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజి సామర్యం ఉంది. బ్యాటరీ బ్యాకప్ యావరేజ్ గా ఉంటుంది. దాదాపు పది గంటల పాటు హెచ్డి వీడియోలను చూసేందుకు వీలుంటుంది. 2జిబి ర్యామ్, 16జిబి ఇన్ బిల్ట్ స్టోరేజీతో ఉన్న ఈ ఫోన్ 7వేల లోపు మార్కెట్లో అందుబాటులో ఉంది. 
RedmiGo....ధర రూ.4,999
షియోమీ మొట్టమొదటి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ రెడ్మీ గో...ని ఈ ఏడాది మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇప్పుడు షియోమీ ఈ ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్. చాలా డీసెంట్ ఆప్షన్లను కలిగి ఉంది. ఈ ఫోన్ హార్డ్ ఫోన్ చాలా సింపుల్ గా ఉంటుంది. 1జిబి ర్యామ్ వస్తోంది. 
ఇక స్క్రీన్ వ్యూ యాంగిల్స్ యూజర్లను ఆకట్టుకుంటాయి. కానీ కలర్స్ కొన్ని తక్కువగా ఉంటాయి. ధరకు తగ్గట్టుగా కెమెరా ఉంటుంది. కానీ అద్భుతమైన ఇమేజ్ లు కావాలని మాత్రం ఎక్స్ పెక్ట్ చేయవద్దు. తక్కువ కాంతిలోనూ ఫోటోలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇక బ్యాటరీ బ్యాకప్ కేవలం తొమ్మిది గంటలు మాత్రమే వస్తుంది. 

జన రంజకమైన వార్తలు