మీకు ఇంట్లో హోం థియేటర్, స్పీకర్స్ సిస్టం ఉంటే సరౌండ్ సౌండ్ గురించే తెలిసే ఉంటుంది. దీనిలో మ్యూజిక్ ముందు వినిపించి కొద్ది సెకన్ల తర్వాత పాట వినిపిస్తుంది. అంటే ముందు మన ఎడమ చెవి మ్యూజిక్‌ను గ్రహిస్తుంది. ఆ తర్వాత కొద్ది క్షణాలకు ఆడియోను కుడిచెవి స్వీకరిస్తుంది. అందుకే ఈ పద్ధతిలో మీకు ఆడియో, మ్యూజిక్ రెండూ చాలా క్లియర్‌గా వినిపిస్తాయి. అయితే మల్టీ స్పీకర్ సిస్టం సెటప్ లేకపోయినా కూడా సరౌండ్ సౌండ్ రావాలంటే వర్చువల్ సౌండ్‌తో సాధ్యం. వర్చువల్ అని పేరుకు తగ్గట్లే దీనిలో మల్టిపుల్ స్పీకర్స్ లేకపోయినా సరౌండ్ సౌండ్ తెచ్చుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 సిరీస్ ఫోన్లలో ఈ ఫెసిలిటీ ఉంది. ఒకవేళ మీకు మామూలు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా కూడా వర్చువల్ సరౌండ్ సౌండ్ వాడుకోవడం ఎలాగో చూడండి.
ఎలా వాడుకోవాలి?
1.Noozxoide EIZO-rewire™ PRO యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.
2.ఇప్పుడు యాప్ ఓపెన్‌చేసి ఎలాంటి స్పీకర్స్ వాడుతున్నారో సెలెక్ట్ చేసుకోండి.యాప్‌లో హెడ్‌ఫోన్స్, సౌండ్ బార్స్ అండ్ స్పీకర్స్, బిల్ట్ ఇన్ ఆన్‌బోర్డ్ స్పీకర్స్, సౌండ్ బార్స్ అండ్ హెచ్‌డీఎం అవుట్‌ఫుట్స్, బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ కోసం వైర్‌లెస్ సెటప్ ఆప్షన్లు ఉంటాయి. మీకు ఏది కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
3. ఇవి సెలెక్ట్ చేసుకున్నక NOOZXOIDE LogicSurroundES subsectionలోకి వెళ్లి మీరు స్టూడియో, లైవ్ ఆప్షన్లలో నుంచి కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. ప్లేబాక్ కింద కూడా NOOZXOIDE Balance XEQ, NOOZXOIDE Psychoacoustics II ఆప్షన్లు ఉంటాయి.
4. ఇందులో మొదటిది వెర్సటైల్, వార్మ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తే, రెండోది స్పీకర్, సౌండ్ ద్వారా పవర్‌ఫుల్ ఆడియో అవుట్‌పుట్ ఇస్తుంది.
సూపర్ ఎక్స్‌పీరియన్స్
ఇది రియల్ సరౌండ్ సౌండ్ సిస్టం అంత సూపర్ కాకపోయినా వర్చువల్ సరౌండ్ ద్వారా మీరు మామూలుగా ఆడియో విన్నదానికంటేచాలా సూపర్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ట్రై చేయండి మరి.