• తాజా వార్తలు

మీ ఎస్‌బిఐ కార్డు పోయిందా, వెంటనే ఇలా బ్లాక్ చేయండి

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లక్షలాది మందికి అకౌంట్లు ఉన్నాయన్న విషయం అందిరీక తెలుసు. అందులో అకౌంట్ ఉన్నవారు ఒక్కోసారి అనుకోకుండా కార్డు పోగోట్టుకున్నట్లయితే వారికి ఏం చేయాలో తెలియదు. ఎలా కంప్లయిట్ ఇవ్వాలో తెలియదు. అలాంటి వారు కంగారు పడకుండా కార్డును బ్లాక్ చేసుకునే మార్గాలు కూడా ఉన్నాయి. పోయిన కార్డు ఎదుటివారికి చేరి ఆ కార్డును వారు వాడేలోపు దాన్ని ఎల్లా బ్లాక్ చేయలో ఓ సారి చూద్దాం.

ముందుగా మీరు www.onlinesbi.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి. అక్కడ మీకు e-Services కనిపిస్తుంది. ఈ "e-Services" ట్యాబ్‌లో "Block ATM Card"అనే ఆప్సన్ ను క్లిక్ చేయండి. అందులో వివిధ రకాల ఆప్సన్లు కనిపిస్తాయి. మీరు ఏ డెబిట్ కార్డు బ్లాక్ చేయాలో ఎంచుకోవచ్చు.ఇక్కడే మీకు బ్లాక్ చేసిన, అన్‌బ్లాక్ చేసిన కార్డుల వివరాలు ఉంటాయి. మీరు మొదటి, చివరి నాలుగు అంకెల ద్వారా కార్డులను గుర్తించొచ్చు.

ఆతర్వాత మీరు బ్లాక్ చేయాలనుకున్న కార్డును ఎంచుకొని సబ్మిట్‌పైన క్లిక్ చేయండి.ప్రాసెస్ పూర్తి అవడానికి ఆథెంటికేషన్ కోసం ప్రొఫైల్ పాస్‌వర్డ్ లేదా ఓటీపీ ఎంచుకోండి. ఆ తర్వాత స్క్రీన్‌లో ప్రొఫైల్ పాస్‌వర్డ్ లేదా ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫమ్ పైన క్లిక్ చేయండి. వెంటనే మీ డెబిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది. ప్రాసెస్ పూర్తి అయిన తరువాత మీకు టికెట్ నెంబర్ కనిపిస్తుంది. రిఫరెన్స్ కోసం టికెట్ నెంబర్ నోట్ చేసుకోవడం మరచిపోకండి.  

జన రంజకమైన వార్తలు