• తాజా వార్తలు

షియోమి నుంచి లక్షరూపాయల పర్సనల్ లోన్ పొందడం ఎలా ?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తమ కంపెనీ ఫోన్ వాడే యూజర్లకు రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్‌ను అందిస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. క్రెడిట్ బీ అనే సంస్థతో కలిసి షియోమీ ఎంఐ క్రెడిట్ సర్వీస్ అనే ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు షియోమీ ఇండియాలో లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. రూ.2 వడ్డీకి దాదాపు రూ. లక్ష (1,400 యూఎస్ డాలర్లు) వరకు లోన్లు ఇవ్వనుంది. షియోమి అర్హులైన కస్టమర్లకు ఈజీగా లోన్లు అందించేందుకు తమ ఫైనాన్షియల్ సర్వీసులను ప్రారంభించనున్నట్టు ఓ నివేదిక తెలిపింది. షియోమీ Mi Credit Service పేరుతో ఎంఐ వినియోగదారులకు ఆఫర్ చేయనుంది. 

ఇప్పటికే Mi Credit సర్వీసును కంపెనీ ‘beta Phase’ కింద రన్ చేస్తోంది. ఇదిలా ఉంటే చైనాలో షియోమీకి 2018 మధ్య ఏడాదికి 8 బిలియన్ డాలర్ల లోన్లలో 2 బిలియన్ డాలర్లు ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టు ఓ రిపోర్టు తెలిపింది. Mi credit సర్వీసు పేరుతో ఇప్పటికే చైనాలో షియోమీ మైక్రో లెండింగ్ ప్రొడక్టును ఆఫర్ చేస్తోంది. 2018 ఏడాది మే నెలలో ఇండియాలో Mi credit సర్వీసును లెండెంగ్ ప్లాట్ ఫాం క్రేజీబీ భాగస్వామ్యంతో లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. 

షియోమీ తమ ఫోన్ యాక్టివిటీ డేటాను యూజర్ల క్రెడిట్ ప్రొఫైల్ క్రియేట్ చేసేందుకు వాడుతుంది. mi creidt సర్వీసు ద్వారా లోన్ పొందాలంటే ముందుగా కంపెనీకి లోన్ అప్లయ్ చేసేవారి పర్సనల్ డేటాను యాక్సస్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్, ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ డేటాకు సంబంధించి మొత్తాన్ని యాక్సస్ చేస్తుంది. దీని ఆధారంగా లోన్ ఆఫర్ చేసే ముందు యూజర్ కు లోన్ అప్రూవ్ చేయాలా లేదా అని డిసైడ్ చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో డేటా ప్రైవసీ అనేది ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో లోన్ల కోసం ఆశ పడి వ్యక్తిగత డేటా వివరాలను బహిర్గతం చేయడం ద్వారా యూజర్ల ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 

జన రంజకమైన వార్తలు