• తాజా వార్తలు

మీ గూగుల్ అకౌంట్ కి మీ ఫోనే తాళం చెవిగా మార్చేయండి ఇలా

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

ఫిషింగ్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ గూగుల్.. ఆండ్రాయిడ్ ఫోన్లనే సెక్యూరిటీ కీ తరహాలో వాడుకునేలా ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏ గూగుల్ సర్వీస్ లోకి యూజర్ లాగిన్ అయినా యూజర్ ఆండ్రాయిడ్ ఫోన్ కు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ఒకే చేస్తేనే...గూగుల్ సర్వీస్ లోకి లాగిన్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ను వాడుకోవాలంటే యూజర్ కు చెందిన ఆండ్రాయిడ్ ఫోన్ లో ఓఎస్ ఆండ్రాయిడ్ 7.0నూగట్ వెర్షన్ ఉండాలి. యూజర్ ఫోన్ తో పాటు తాను లాగిన్ అవ్వాలనుకున్న డివైస్ లో బ్లూటూత్ ఆన్ చేయాలి. తర్వాత గూగుల్ అకౌంట్ ఆండ్రాయిడ్ ఫోన్ యాడ్ చేయాలి.తర్వాత సెట్టింగ్స్ లో 2 స్టెప్ వెరిఫికేషన్ ను ఆన్ చేస్తే...ఓ సెక్యూరిటీ కీ ఆటోమెటిగ్గా క్రియేట్ అవుతుంది. అప్పుడే యూజర్ తనకున్న ఆండ్రాయిడ్ డివైసులలో సెక్యూరిటీ కీ కావాలనుకున్న ఏదైనా ఒక డివైసును యాడ్ చేస్తే చాలు. 

తాళం లా పనిచేస్తుంది. దీంతో ఒకపై యూజర్ కు ఉన్న గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ అయినప్పుడల్లా ఈ డివైసుకు ఒక మెసెజ్ వస్తుంది. అప్పుడు దాన్ని ఓకే చేస్తేనే గూగుల్ అకౌంట్ పాస్ వర్డ్ తెలిసినప్పటికీ అందులోకి లాగిన్ కాలేరు. ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్ కు వచ్చిన మెసేజ్ ను ఓకే చేసినట్లయితేనే...గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ అవుతారు. ఇలా చేయడం ద్వారా యూజర్ల గూగుల్ అకౌంట్లు సేఫ్ గా ఉంటాయి. దీని వల్ల ఫిషింగ్ దాడులను కూడా అరికట్టవచ్చు. 

జన రంజకమైన వార్తలు