పబ్‌జీ గేమ్ ఇప్పుడు యువతను బాగా ఆకర్షిస్తోంది. ఆకర్షణ కన్నా ఈ గేమ్‌కు బానిసయిపోయారని మాత్రం చెప్పవచ్చు. యువతే కాదు.. స్కూల్ విద్యార్థులు కూడా ఈ గేమ్‌కు బాగా అడిక్ట్ అయిపోయారు. మరి దీన్ని కంట్రోల్ చేసుకోలేమా అంటే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా దీని నుంచి తేలికగా బయటపడవచ్చు. అవేంటో చూద్దాం.
Digital Wellbeing
Android Pie ఓఎస్ ఉన్నవాళ్లు డిజిటల్ వెల్‌బీయింగ్ టూల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ టూల్‌ను గూగుల్ డెవలప్ చేసింది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో మీరు రోజులో ఎంత సమయం గడుపుతున్నారు, ఎంతసేపు స్మార్ట్‌ఫోన్‌లో గడపాలో అనేది సెట్ చేసుకోవచ్చు. ప్రతి యాప్ మీద రిపోర్ట్స్ కూడా పొందొచ్చు. గూగుల్ పైని సపోర్ట్ చేసే ఫోన్లలో మాత్రమే డిజిటల్ వెల్‌బీయింగ్ పనిచేస్తుంది. ఒకవేళ గూగుల్ పై ఓఎస్ లేని యూజర్లు... డిజిటల్ వెల్‌బీయింగ్‌ను పోలిన యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ActionDash
ఇది కూడా డిజిటల్ వెల్‌బీయింగ్ లాంటి యాప్ లాగే ఉంటుంది. అయితే ఈ యాప్‌లో టైమ్ లిమిట్ ఫీచర్ లేదు. వారాంతపు రిపోర్టులను దీని ద్వారా పొందొచ్చు. మీరు ఒక వారంలో పబ్‌జీని ఎంత సేపు ఆడారో ఇది రిపోర్టు ఇస్తుంది. ఆ రిపోర్టు ప్రకారం మీరు పబ్‌జీ ఆడే సమయాన్ని కుదించుకోవచ్చు.
Space
మీరు పెట్టుకున్న టైమ్ లిమిట్ దాటితే Space మీకు అలర్ట్ పంపిస్తుంది. అలర్ట్ రాకముందే టైమ్ లిమిట్ దాటకముందే మీ లక్ష్యాలను పూర్తి చేస్తే స్పేస్ మీకు రివార్డ్స్ కూడా అందిస్తుంది. దీని వల్ల ముందే టైమ్ ఫిక్స్ చేసుకొని ఆ టైమ్ లిమిట్‌లోనే గేమ్ ఆడే వీలు ఉంటుంది. తద్వారా ఎక్కువ సమయం వృథా కాకుండా ఉంటుంది.
App Detox
ఫోన్ వాడకాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం యాప్ డిటోక్స్ యూజర్లకు చాలా ఆప్షన్లను ఇస్తుంది . పబ్‌జీ గేమ్‌పై ఒక్కసారి మీరు టైమ్ లిమిట్ పెట్టుకున్నాక రెండోసారి కూడా అలాగే ఆ టైమ్ లిమిట్‌లోనే గేమ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టైమ్ లిమిట్ దాటితే పబ్‌జీ యాప్‌ను మీరు ఉపయోగించకుండా యాప్‌ను ఆపేస్తుంది.
Screen Time
ఇది కూడా డిజిటల్ వెల్‌బీయింగ్ లాంటి యాప్ లాగే ఉంటుంది. పబ్‌జీ యూజర్లు స్క్రీన్ టైమ్‌లో టైమ్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు