• తాజా వార్తలు

ఎయిర్‌టెల్ యూజర్లు ఉచిత కాలర్ ట్యూన్స్ సెట్ చేసుకోవడం ఎలా ? 

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో దెబ్బకు దిగ్గజ టెల్కోలు ఒక్కసారిగా కుదేలైన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఉచిత డేటా సునామి ఆఫర్లతో వాటిని కోలుకోలేని దెబ్బ తీసింది. టెలికాం రంగం గురించి క్లుప్తంగా చెప్పాలంటే జియో రాకముందు జియో వచ్చిన తరువాత అని చెప్పుకోవాలి. ఇప్పటికీ ఉచిత ఆఫర్లతో జియో దూసుకుపోతోంది. చౌక ధరకే సేవలు అందించడంతోపాటు ఫ్రీగానే ఇంకా కాంప్లిమెంటరీ సర్వీసులు కూడా ఆఫర్ చేస్తోంది. 

ఈ ధాటిని తట్టుకునేందుకు ఇతర టెలికం కంపెనీలు కూడా కస్టమర్లకు కాంప్లిమెంటరీ సేవలను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే జియో ఉచిత కాలర్ ట్యూన్స్‌ అందిస్తున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్ కూడా కస్టమర్లకు ఉచితంగానే కాలర్ ట్యూన్స్ అందిస్తోంది.  ఇప్పుడు ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు నచ్చిన పాటను కాలర్ ట్యూన్‌గా ఉచితంగా పెట్టుకోవచ్చు. 

ఇప్పుడు ఎయిర్‌టెల్‌కు చెందిన యూజర్లు వింక్ మ్యూజిక్ యాప్ ద్వారా ఉచిత కాలర్ ట్యూన్స్ పొందొచ్చు. అలాగే వారి హలో ట్యూన్స్ మార్చుకోవచ్చు. వింక్ యాప్‌లో 15 భాషలకు చెందిన 10 లక్షల పాటలు ఉన్నాయి. 

ఇందుకోసం యూజర్లు ముందుగా వింక్ మ్యూజిక్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలి.  ఆ తర్వాత దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. వింక్ మ్యూజిక్ యాప్‌ను ఓపెన్ చేయగానే ఉచిత హలో ట్యూన్స్‌కు సంబంధించిన పాపప్ మెసేజ్ వస్తుంది. దీని సాయంతో ఫ్రీ కాలర్‌ ట్యూన్ సెట్ చేసుకోవచ్చు. అలాగే కాలర్ ట్యూన్‌ మార్చుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు