ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లకు పవర్ బ్యాంకులు తప్పనిసరిగా మారాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు వీటి ఉపయోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్ వాడటం స్టార్ట్ చేస్తే...ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. ఇలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంకులను వాడుతుంటారు. అయితే పవర్ బ్యాంకులను కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది కొనుగోలు చేయోద్దు. కాబట్టి ఎక్కువగా రోజులు వచ్చే నాణ్యమైన పవర్ బ్యాంకులను కొనుగోలు చేయడం ఉత్తమం. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని యుఎస్బి 3.0 తో పవర్ బ్యాంకుల గురించి తెలుసుకుందాం.
పవర్ బ్యాంకులను కొనుగోలు చేసేటప్పుడు ఇవి తప్పనిసరి....
1. రీఛార్జింగ్ టైం
2. ప్రొడక్టు యొక్క పోర్టబిలిటి (బరువు, వాల్యూమ్)
3.వారంటీ కవరేజ్ ఉందా?
4. పవర్ బ్యాంక్ యొక్క అసలు కెపాసిటి ఎంత?
మార్కెట్లో కుప్పలు తెప్పలుగా పవర్ బ్యాంకులు ఉంటాయి. అలా అని ఏదిపడితే కొనుగోలు చేయోద్దు. మీ ఫోన్ కు సరిపోయే స్పీడ్ ను అందించే ప్రొడక్టును మాత్రమే తీసుకోవాలి. కొన్ని పవర్ బ్యాంకులు ఎక్కువ ఛార్జీని కలిగి ఉంటాయి. 5000ఎంఏహెచ్ పోర్టబుల్ ఛార్జర్ ను 2500ఎంఏహెచ్ బ్యాటరీ కోసం కొనుగోలు చేసినట్లయితే తప్పులో కాలేసినవారవుతారు. మీ ఫోన్ సామర్థ్యానికి కావాల్సిన పవర్ బ్యాంక్ కొనుగోలు చేయడం బెట్టర్.
1.AUKEY 30000MAH PORTABLE POWER BANK...
ఈ పవర్ బ్యాంక్ 30,000ఎంఏహెచ్ కెపాసిటితో వస్తుంది. అసలు కెపాసిటి 20,000ఎంఏహెచ్. నోటిఫికేషన్ కోసం ప్రత్యేకంగా ఎల్ఈడి లైట్స్ ఉండవు. పవర్ బటన్ కలర్ తెలుసుకునేందుకు పవర్ లెవల్ స్టాటస్ కనిపిస్తుంది. దీని బరువు 1.3 పౌండ్లు. ధర 59.99డాలర్లు. ప్రధానంగా జర్నీలో పవర్ బ్యాంక్ అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పవర్ బ్యాంక్ ను జర్నీలో ఈజీగా క్యారీ చేయవచ్చు.
2.ANKER POWERCORE 20000....
ఈ పవర్ బ్యాంకు 20,000 కెపాసిటితో వస్తుంది. తొందరగా ఛార్జింగ్ అవుతుంది. సుమారు ఆరుగంటల్లో రిఫ్యూల్స్ చేయబడుతుంది. ఈ పవర్ బ్యాంక్ మిగతావాటి కంటే 27శాతం తేలికగా ఉంటుంది. దీనిలో రెండు అవుట్ పుట్ యుఎస్బిలు ఉన్నాయి. ఒకటి క్యూసి 3.0కాగా మరొకటి 1ఏ ఐక్యూ టెక్. ఛార్జీంగ్ కోసం మైక్రో యుఎస్బి సపోర్ట్ చేస్తుంది. దీని బరువు 13 ఔన్సులు. అమెజాన్ లో 59.99 డాలర్లకు అందుబాటులో ఉంది.
3.RAVPOWER TURBO SERIES 20100 PORTABLE CHARGER....
ఈ పవర్ బ్యాంక్...ఒక హెవీ బిట్ పోర్టబుల్ ఛార్జర్ ను కలిగి ఉంటుంది. చాలా తొందరగా ఛార్జీంగ్ అవుతుంది. చిన్న గాడ్జెట్లకే కాకుండా పెద్ద పెద్ద గాడ్జెట్లకు కూడా ఛార్జింగ్ చేయవచ్చు. ఈ రెండు మూడు రంగుల్లో వస్తుంది. బరువు 1.1పౌండ్లు ఉంటుంది. ధర 53.99డాలర్లు. దీనికి ప్రత్యామ్నాయంగా క్యూసి 3.0 తో రా పవర్ 10,000ఎంఏహెచ్ పోర్టబుల్ ఛార్జర్ను కూడా వాడుకోవచ్చు.
4.ZEROLEMON TOUGHJUICE V3.0
ఈ పవర్ బ్యాంక్ 30,000ఎంఏహెచ్ కెపాసిటితో ఉంటుంది. ఇది మొత్తం ఐదు పోర్టులను కలిగి ఉంది. ఇందులో ఒకటి క్యూసి3.0కోసం రిజర్వు చేయబడి ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ భారీ కెపాసిటిని కలిగి ఉంటుంది. క్యాచ్ పరిమాణంలో ఉన్న ఈ పవర్ బ్యాంక్ సుమారు 1.25పౌండ్ల బరువు ఉంటుంది. వీటితోపాటు యుఎస్బి టైప్ సి పోర్టును కలిగి ఉంది. ధర 59.99డాలర్లు.
5.TRONSMART EDGE20000 PORTABLE CHARGER
20,000ఎంఏహెచ్ కెపాసిటితో ఈ పవర్ బ్యాంకు ఉంటుంది. చాలా తేలికైనా పోర్టబుల్ ఛార్జర్లలో ఇది ఒకటి. ఇది టైప్ సి పోర్ట్, యుఎస్బి పోర్ట్ తోపాటు క్యూసీ 3.0 ప్రత్యేకమైన పోర్టులను కలిగి ఉంటుంది. మైక్రో యుఎస్బి లేదా యుఎస్బి టైప్ సి పోర్టును ఉపయోగించి బ్యాటరీ ఛార్జీంగ్ చేసుకోవచ్చు. ఇక ఈ పవర్ బ్యాంకు నాలుగు ఎల్ఈడి లైట్లను కలిగి ఉంటుంది. ధర 25.99డాలర్లు
6.20000MAH MI POWER BANK 2I
20,000ఎంఏహెచ్ కెపాసిటితో, ఈ పవర్ బ్యాంక్ వచ్చింది. దీనితో ఒకేసారి రెండు మొబైల్స్ కు ఛార్జింగ్ పెట్టవచ్చు. 358 గ్రాముల బరువుతో ఉంటుంది. బ్లూటూతూ హెడ్ సెట్స్, ఫిట్ నెస్ డివైస్ లాంటి చిన్నగాడ్జెట్స్ ను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంకు సమారు ఆరు గంటల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఈ పవర్ బ్యాంక్ పై 4ఎల్ఈడీ లైట్లు కూడా ఉన్నాయి. ఇవి బ్యాటరీ ఛార్జింగ్ ను సూచిస్తాయి.