• తాజా వార్తలు

ఫేస్ బుక్ కి మీ గురించి తెలిసిన టోటల్ లొకేషన్ హిస్టరీ ని కనిపెట్టి డిలీట్ చేయడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మీ మొబైల్ లో ఫేస్ బుక్ యాప్ ఉందా? అయితే మీ లొకేషన్ హిస్టరీ గురించి మీ కంటే ఫేస్ బుక్ కే ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. ఈ హిస్టరీ మీ మొబైల్ యాప్ లో స్టోర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇది ప్రైవేటు డేటా అయినప్పటికీ మీరు చూసే అవకాశం కూడా ఉంది. అయితే ఈ డేటా అంటే ఫేస్ బుక్ లో మీ లొకేషన్ హిస్టరీ కి సంబందించిన డేటా ను కనిపెట్టి డిలీట్ చేయడం ఎలాగో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఫేస్ బుక్ లొకేషన్ హిస్టరీ ని చూడడం ఎలా ?

మీ లొకేషన్ హిస్టరీ ని బ్రౌజర్ లో చూడాలి అంటే

  1. సెట్టింగ్స్ > లొకేషన్ లోనికి వెళ్ళాలి
  2. వ్యూ యువర్ లొకేషన్ హిస్టరీ పై క్లిక్ చేయాలి.
  3. మీరు మీ పాస్ వర్డ్ ఎంటర్ చేయ వలసిందిగా అడుగుతుంది.

మీ ఫోన్ లో లొకేషన్ హిస్టరీ ని చూడడం ఎలా ?

  1. సెట్టింగ్స్ > ఎకౌంటు సెట్టింగ్స్ > లొకేషన్ లోనికి వెళ్ళండి
  2. వ్యూ యువర్ లొకేషన్ హిస్టరీ పై ట్యాప్ చేయండి
  3. మీరు మీ పాస్ వర్డ్ ఎంటర్ చేయ వలసిందిగా అడుగుతుంది.

ఇప్పుడు మీరు మీకు అవసరమైనంత లొకేషన్ హిస్టరీ కి సంబందించిన డేటా ను చూడగలుగుతారు. ఈ డేటా లో మీరు సంచరించిన వివిధ రకాల లొకేషన్ లకు సంబందించిన సమాచారం ఉంటుంది. మీరు మీ లొకేషన్ హిస్టరీ ని డేట్ ప్రకారం కూడా చూడవచ్చు.

ఫేస్ బుక్ లొకేషన్ హిస్టరీ ని డిలీట్ చేయడం ఎలా?

  మీ ఫేస్ బుక్ లొకేషన్ హిస్టరీ మొత్తాన్నీ ఒకే ఒక్క క్లిక్ లో మీరు డిలీట్ చేయవచ్చు. ఇంతకుముందు ఓపెన్ చేసిన పేజి లో కుడి వైపు పై భాగాన ఉన్న డిలీట్ ఆల్ లొకేషన్ హిస్టరీ అని ఉన్నదానిపై క్లిక్ చేస్తే చాలు మీ లొకేషన్ హిస్టరీ అంతా డిలీట్ అవుతుంది.

ఫేస్ బుక్ లొకేషన్ హిస్టరీ ని టర్న్ ఆఫ్ చేయడం ఎలా ?

ఈ ఫీచర్ మీకు ఇష్టం లేదు కాబట్టి టర్న్ ఆఫ్ చేయాలి అనుకోండి. చలసిమ్ప్లె గా దేనిని టర్న్ ఆఫ్ చేయవచ్చు. ఆ ప్రక్రియ ఇలా ఉంటుంది.

  1. సెట్టింగ్స్ > ఎకౌంటు సెట్టింగ్స్ > లొకేషన్
  2. ఫేస్ బుక్ సెట్టింగ్స్ లో లొకేషన్ సెట్టింగ్స్ అని ఉన్న దగ్గర దానిని ఆఫ్ చేయడమే .

జన రంజకమైన వార్తలు