గూగుల్ అకౌంట్‌లో ఉన్న సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా రక్షించేందుకు.. సెక్యూరిటీ చెకప్ టూల్‌ని రూపొందించింది. ప్రస్తుతం దీనిని వినియోగిస్తున్న వారి సంఖ్య మాత్రం తక్కువనే చెప్పుకోవాలి. గూగుల్ అకౌంట్‌ని కొన్ని థర్డ్ పార్టీ యాప్స్‌తో పాటు దీనికి కనెక్ట్ అయిన పరికరాలు ఉపయోగించుకుంటూ ఉంటాయి. వీటి ద్వారా ఎవరైనా గూగుల్ అకౌంట్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇతర సెక్యూరిటీ చెకప్ అవసరం లేకుండా.. గూగుల్ ఉచితంగానే సెక్యూరిటీ టూల్‌ని తీసుకొచ్చింది. గూగుల్ అకౌంట్‌ని ఉపయోగించుకుంటున్న థర్డ్ పార్టీ యాప్స్‌తో పాటు పరికరాలను కూడా గుర్తించి.. వాటి యాక్సెస్‌ను తొలగించవచ్చు. దీనిని సమగ్రంగా ఎలా ఉపయోగించుకోవాలో ఈ గైడ్ ద్వారా తెలుసుకుందాం!
* ముందుగా గూగుల్ అకౌంట్‌లోకి సైన్ ఇన్ అవ్వాలి. తర్వాత.. కుడి వైపున ఉండే గూగుల్ యాప్స్‌లో అకౌంట్‌ని సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ చెకప్ టూల్‌ని ఓపెన్ చేయగానే.. మన గూగుల్ యాప్‌లో ఉన్న మొత్తం సమస్యలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. గూగుల్ అకౌంట్‌ను ఎన్ని థర్డ్ పార్టీ యాప్స్ అకౌంట్‌ని ఉపయోగించుకుంటున్నాయి. లాస్ట్ లాగిన్ వివరాలు, సెక్యూరిటీ ఈవెంట్స్ వంటి వివరాలన్నీ.. వివిధ రంగుల్లో కనిపిస్తుంటాయి. ప్రతి సెక్షన్‌కు పక్కన ఆకుపచ్చ రంగులో టిక్ మార్క్, పసుపు రంగులో ఆశ్చర్యార్థకంతో పాటు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎరుపు రంగులో నోటిఫికేషన్లు కనిపిస్తాయి.
Sign-in & recovery
ఒకవేళ గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయిన సందర్భంలో ప్రత్యామ్నాయ ఈమెయిల్ ఇచ్చేందుకు, గూగుల్ అకౌంట్‌కు ఫోన్ నంబర్ యాడ్ చేసేందుకు(టూ వే ఆథంటిఫికేషన్ కోసం) ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ రెండూ ఇవ్వకపోతే ఈ ఆప్షన్ ద్వారా వీటిని యాడ్ చేసుకోవచ్చు.
Third-party access
కొన్ని యాప్స్ ఇన్‌స్టాల్ చేసే సమయంలో తెలియకుండానే యాక్సెస్ ఇచ్చేస్తుంటాం. కొన్ని యాప్స్ అనవసరంగా గూగుల్ అకౌంట్ డేటాను వినియోగించుకుంటాయి. కొన్ని యాప్స్ ఈ సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తుంటాయి. గూగుల్ అకౌంట్‌ని యాక్సెస్ చేస్తున్న థర్డ్ పార్టీ యాప్స్‌ను తెలుసుకుని, వాటికి యాక్సెస్ ఇవ్వకుండా చేసేందుకు ఈ ఆప్షన్. ఏదైనా హానికరమైన యాప్ అని అనిపిస్తే.. యాప్ పర్మిషన్స్ మార్చి గూగుల్ అకౌంట్ యాక్సెస్‌ను తొలగించవచ్చు.
Your devices
మన గూగుల్ అకౌంట్‌కి కనెక్ట్ అయిన స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, ఇతర పరికరాల గురించి తెలుసుకోవచ్చు. సంవత్సరం, ప్రాంతం కూడా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఏదైనా అనుమానాస్పద డివైజ్ అకౌంట్‌కి కనెక్ట్ అయిందని గమనిస్తే.. వెంటనే ఈ సెక్షన్‌లో పాస్‌వర్డ్ మార్చుకోవచ్చు.
Recent security events
గత 28 రోజుల్లో మనం కాకుండా వేరేవరైనా అకౌంట్‌లోకి లాగిన్ అయినా, ముఖ్యమైన సెట్టింగులు వంటివి మార్చడం వంటివి చేసినా.. ఈ సెక్షన్‌లో తెలుస్తుంది. వీటితో పాటు టూ వే ఆథంటెఫికేషన్ ఆప్షన్ యాడ్ చేసుకుంటే గూగుల్ అకౌంట్‌కి మరింత రక్షణగా ఉంటుంది.